
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
AP Weather Alert:దక్షిణ కోస్తాకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. వచ్చే 24 గంటల్లో కోస్తాంధ్రలోని పలు ప్రాంతాలకు బిగ్ అలర్ట్ ప్రకటించింది. ఇక కోస్తా నుంచి తెలంగాణ మీదుగా మధ్య మహారాష్ట్ర వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉంది. ఈశాన్య తూర్పు మధ్య బంగాళ ఖాతం మీదుగా ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో రాగల 48 గంటల్లో ఏపీలో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాదు కోస్తా తీరం వెంబడి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని వెల్లడించింది.
ఏపీ వ్యాప్తంగా నైరుతి ఋతుపవనాల విస్తరణ.. అలాగే పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈశాన్య తూర్పు మధ్య బంగాళ ఖాతం మీదగా కూడా ఆవర్తనం కొనసాగుతుంది దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ అతి భారీ వరసాలు కురిసేందుకు అవకాశం ఉందని ముఖ్యంగా దక్షిణా కోస్తా ప్రాంతానికి వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. నైరుతి వృత్తి పవనాలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తరించినప్పటికీ కూడా దాని ప్రభావం అయితే కాస్త తగ్గుముఖంగానే ఉన్నాయని ఐఎండీ తెలిపింది. బంగాళా ఖాతంలో ఉపరితల ఆవర్తనం.. బంగళా ఖాతంలో కొనసాగుతున్నటువంటి ఆవర్తనంతో పాటు ఉపరితల ద్రోణి ప్రభావంతో గంటలకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ప్రకటించింది. ముఖ్యంగా చూసుకుంటే కొన్ని జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో కురవాల్సిన వర్షం ఎల్‌నినో ప్రభావంతో కొన్ని ప్రాంతాలకే పరిమితమైందని చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోనే ఉత్తరాంధ్రలోని పార్వతీపురం మన్యం,విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం అనకాపల్లి ఈ ప్రాంతాల్లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి.గత రెండు రోజులుగా కూడా విశాఖలో పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసాయి. అయితే జూన్ నెలలో కురువాల్సిన వర్షం కంటే తక్కువే నమోదు అయింది .
కోస్తా తీరం వెంబడి గంటలకు 50 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు..
కోస్తా ప్రాంతం వెంబడి ఉన్నటువంటి ప్రదేశాల్లో గంటకి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశాలున్నాయని ఐఎండీ తెలిపింది. ముఖ్యంగా ప్రజలందరూ కూడాను ఈదురు గాలులు వీచే సమయంలో కావచ్చు లేదా ఉరుములు మెరుపులు వచ్చే సమయంలో గాని పిడుగులు పడే సమయంగానే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచిస్తోంది.
పిడుగుపాటుతో ప్రజల ప్రాణాలకు ఇబ్బంది కలిగేటటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజల సెల్ ఫోన్లకి ముందస్తుగానే ఆర్టిజిఎస్ అనేటటువంటి ఒక యాప్ ద్వారా పూర్తిగా ముందస్తు హెచ్చరికలు అయితే జారీచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే ఈదుగు గాలుల కారణంగా వృక్షాలన్నీ కూడా నేలకూలుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే రహదారి వెంబడి ఉన్నటువంటి వృక్షాలు ఏవైతే ఉన్నాయో, ఈ వృక్షాలు నేలకూలడంతో ముఖ్యంగా ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ కూడా పూర్తిగా స్తంభించింది పోయింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, తక్షణ విపత్తు నిర్వహణ దళం అందుబాటులో ఉంచారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.