
ఇంటర్నెట్ డెస్క్: రెండేళ్లు ఒంటరిగా ఇంట్లో ఉండి ఎన్నో కష్టాలు అనుభవించానని భావోద్వేగానికి గురయ్యారు నటి సమంత (Samantha).
ఆమె ప్రధానపాత్రలో నటించిన ‘మా ఇంటి బంగారం’ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా చిత్రబృందం వైజాగ్లో థాంక్స్ మీట్ నిర్వహించింది. అందులో సమంత మాట్లాడుతూ.. ఈ చిత్రానికి ముందు ఎన్నో బాధలు పడినట్లు చెప్పారు. ఇక సినిమాలు ఆపేయాలని అనుకున్నానని.. కానీ, రాజ్ వల్లే ఈ సినిమా చేశానని చెప్పారు.