
ఇంటర్నెట్ డెస్క్: ఇక సినిమాలు చేయనని రెండేళ్ల క్రితం సమంత (Samantha) తనతో చెప్పిందని ఆమె భర్త రాజ్ నిడిమోరు తెలిపారు. ఆమె చాలా గొప్ప నటి అని ఎలా అయినా ఆమెతో సినిమా చేయించాలని అనుకున్నట్లు చెప్పారు.
సమంత ప్రధానపాత్రలో నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మా ఇంటి బంగారం’ (Maa Inti Bangaaram). తాజాగా ఈ సినిమా థాంక్స్ మీట్‌ను వైజాగ్‌లో నిర్వహించారు. ఆ ఈవెంట్లో చిత్ర నిర్మాత రాజ్ మాట్లాడుతూ.. ఈ చిత్రానికి సీక్వెల్ కూడా తీస్తామని వెల్లడించారు. ఇదే బృందంతో పార్ట్ 2 వస్తుందని చెప్పారు. ఈ వీడియో చూశారా: రెండేళ్లు ఒంటరిగా ఎన్నో కష్టాలు అనుభవించా: సమంత