
అనిశా వలలో తిరుపతి పీసీబీ ఎన్విరాన్మెంట్ సీనియర్ ఇంజినీరు కర్నూలు నేరవిభాగం, న్యూస్టుడే: ఏపీ కాలుష్య నియంత్రణ మండలి తిరుపతి జోనల్ కార్యాలయ సీనియర్ ఎన్విరాన్మెంట్ ఇంజినీరు యుగంధర్...
అనిశా వలలో తిరుపతి పీసీబీ ఎన్విరాన్మెంట్ సీనియర్ ఇంజినీరు
కర్నూలు నేరవిభాగం, న్యూస్టుడే: ఏపీ కాలుష్య నియంత్రణ మండలి తిరుపతి జోనల్ కార్యాలయ సీనియర్ ఎన్విరాన్మెంట్ ఇంజినీరు యుగంధర్ మునిప్రసాద్ అవినీతి నిరోధక శాఖ (అనిశా) ఉచ్చులో పడ్డారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న అభియోగంపై కర్నూలు రేంజ్ అనిశా డీఎస్పీ సోమన్న ఆధ్వర్యంలో ఏడు బృందాలు శుక్రవారం కర్నూలులోని ఆయన స్వగృహంతో పాటు తిరుపతి, హైదరాబాద్లోని కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలో తనిఖీలు చేశాయి. మునిప్రసాద్ ఖరీదైన ఇంటితో పాటు పలు స్థిర, చరాస్తులు కలిగి ఉన్నారని.. వాటి విలువ రూ.4 కోట్లకుపైగా ఉంటుందని అంచనా వేశారు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ అంతకు మూణ్నాలుగు రెట్లు ఎక్కువ ఉంటుందని భావిస్తున్నారు. ఓ బ్యాంకులో భార్య పేరుతో ఓ లాకర్ ఉన్నట్లు గుర్తించగా, దాన్ని 29న తెరవనున్నారు. కేసు నమోదు చేసిన అనిశా అధికారులు మునిరామయ్యను అదుపులోకి తీసుకున్నారు. కర్నూలుకు చెందిన మునిప్రసాద్ 2001లో ఒప్పంద ప్రాతిపదికన తెలంగాణలోని మెదక్ జిల్లాలో పీసీబీ కార్యాలయంలో కెమికల్ ఇంజినీరుగా చేరారు. 2005 రెగ్యులర్ కాగా, 2008లో కర్నూలుకు బదిలీ అయ్యారు. తర్వాత వివిధ ప్రాంతాల్లో పనిచేసి, 2025లో తిరుపతికి వచ్చారు. ఆయన పనిచేసిన ప్రతిచోటా అవినీతి ఆరోపణలు రావటంతో అనిశా అధికారులు నిఘా ఉంచి, దాడి చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.