
ఇంటర్నెట్ డెస్క్: వెనెజువెలాలో భూకంపం (Earthquake) పెను విషాదం నింపింది. ఈ భూ విలయం సృష్టించిన విధ్వంసంలో మృతుల సంఖ్య 589కి పెరిగింది. గాయపడిన వారి సంఖ్య 3 వేలు దాటింది.
ఈ మేరకు ఆ దేశ తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ వివరాలను వెల్లడించారు. అత్యంత తీవ్రంగా దెబ్బతిన్న లా గువేరా ప్రావిన్సులో సహాయక చర్యల కోసం సైనికులను మోహరిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు శిథిలాల కింద వందలాది మంది చిక్కుకుపోయినట్లు అక్కడి ప్రభుత్వం అంచనా వేస్తోంది. గల్లంతైన వారి వివరాలను సేకరించేందుకు ఏర్పాటు చేసిన వెబ్సైట్లో ఇప్పటివరకు దాదాపు 50 వేల మంది పేర్లు నమోదైనట్లు సమాచారం.
లా గువేరా నగరంలోనే దాదాపు 100కుపైగా భారీ భవనాలు నేలమట్టమైనట్లు అంచనా. శిథిలాల కింద చిక్కుకున్న వారిని సాధ్యమైనంత త్వరగా బయటకు తీసేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. సహాయక చర్యల్లో పాల్గొనేందుకు వెనెజువెలా చేరుకున్న పలు విదేశీ బృందాలు రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నాయి. ఈ కష్ట కాలంలో వెనెజువెలాకు భారత్ ఆపన్న హస్తం అందించింది. ఆ దేశానికి ఔషధాలు, వైద్య పరికరాలతో ప్రత్యేక సైనిక బృందాన్ని పంపించింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.