
విశాఖపట్నం: టెకీ రాధాగాయత్రి (Radha Gayatri) అనుమానాస్పద మృతి కేసులో ఆమె తండ్రి సుధాకర్ సంచలన ఆరోపణలు చేశారు. చంపాలనే పక్కా ప్రణాళికతోనే రాధాగాయత్రిని భర్త శ్రీచరణ్ మసూరీ తీసుకెళ్లాడన్నారు.
విశాఖపట్నంలో మీడియాతో ఆయన మాట్లాడారు.
‘‘శ్రీచరణ్ అందరినీ తప్పుదారి పట్టించాడు. ముందస్తు ప్లాన్‌తోనే మా అమ్మాయిని హత్య చేశాడు. ఉదయం 6.30 గంటలకు చనిపోయినట్లు నాకు 8.10 గంటలకు కాల్ చేశాడు. టికెట్లు పంపిస్తున్నాను.. వచ్చేయండని చెప్పాడు. అంతకుముందు ఎంతోమందితో సంప్రదింపులు జరిపాడు. ఉత్తరాఖండ్‌లో లాయర్‌ను కూడా పెట్టుకున్నాడు.
భార్యపై ప్రేమ ఉన్నవాడు ఆమె దశదినకర్మకు ఎందుకు రాలేదు?సింహాచలం నుంచి ఒక్కసారిగా ఇల్లు ఎందుకు ఖాళీ చేశాడు?శ్రీచరణ్ తన మొబైల్ స్విచాఫ్ చేసి ప్రస్తుతం విశాఖలోనే తిరుగుతున్నాడు. తల్లిదండ్రులే అతడిని పోలీసులకు అప్పగించాలి. మసూరీ పోలీసులు ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేయాలి. సమాజంలో అందరి ముందూ ఉరితీస్తే ఇలాంటి మృగాలు రాకుండా ఉంటాయి’’ అని సుధాకర్ అన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తల్లిదండ్రులు అపురూపంగా నిర్మించుకున్న ఇంటిపై మమకారం పెంచుకున్న కుమారుడు.. ఆ సౌధాన్ని కూల్చి కొత్త నిర్మాణం చేయడానికి ఇష్టపడలేదు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) తాజాగా ‘ఎక్స్’లో పోస్టు చేసిన ఓ వీడియా వైరల్‌గా మారింది.