
రేఖ వేదవ్యాస్.. పేరు చెబితే గుర్తు పట్టకపోవచ్చు కానీ.. ఆనందం హీరోయిన్ అంటే మన కళ్ల ముందు ఓ అందమైన రూపం మెదులుతుంది. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకుంది రేఖ.
ఒకటో నెంబర్ కుర్రాడు, జానకి వెడ్స్ శ్రీరామ్, దొంగోడు, అనగనగా ఓ కుర్రాడు వంటి పలు సూపర్ హిట్ సినిమాల్లో కథానాయికగా చేసిందీ ముద్దుగుమ్మ. తెలుగుతో పాటు తమిళం, కన్నడ భాషల్లోనూ సినిమాలు చేసి ఆడియెన్స్ మెప్పు పొందింది. అయితే ఏమైందో తెలియదు కానీ 2014 తర్వాత ఏ సినిమాలోనూ కనిపించలేదీ ముద్దుగుమ్మ. మధ్యలో కొన్ని టీవీ షోల్లోనూ మెరిసినా వెండితెరపై మాత్రం కనిపించలేదు. అలాగే కొన్ని ఇంటర్వ్యూలకు హాజరై తాను ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నానంటూ, ట్రీట్మెంట్ తీసుకున్నానంటూ షాకింగ్ విషయం చెప్పింది. ఇక గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది రేఖ. ఇన్ స్టా గ్రామ్ లో గ్లామరస్ ఫొటోస్, వీడియోలు షేర్ చేస్తోంది. అలాగే ఇంటర్వ్యూలు ఇస్తూ రీ ఎంట్రీకి రెడీ, ఛాన్సులు ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది రేఖ.
ఈ ముద్దుగుమ్మ వయసు ఇప్పుడు సుమారు 40 సంవత్సరాలు. అయినా పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే లైఫ్ లీడ్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది రేఖ. ‘సల్మాన్ ఖాన్ లాగా నేను కూడా సింగిల్ గా మిగిలిపోతానేమోననిపిస్తోంది. గతంలో నేను ఒకరిని బాగా ఇష్టపడ్డాను. కానీ ఈ విషయం అతనికి చెప్పలేదు. అప్పుడు సిగ్గు, చెప్తే ఏమంటారో, వర్కౌట్ అవుతుందో లేదోనని భయపడ్డాను. ఆ తర్వాత నాకు మంచి అబ్బాయి ఎవరూ దొరకట్లేదు. అందరూ నాకు ఎవరో ఉన్నారు కానీ చెప్పట్లేదు అంటూ నా గురించి తెగ ప్రమోట్ చేశారు. కానీ నేను ఇంకా సింగిల్ గానే ఉన్నాను.
‘ఈ భూమి మీద పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ ఎవరూ ఉండరు. నేను కూడా పర్ఫెక్ట్ కాదు. కానీ నాకు ఓ మంచి అబ్బాయి కావాలి. నన్ను బాగా ప్రేమించాలి . నన్ను జెన్యూన్ గా ఇష్టపడే వాళ్లు ఎవరైనా ఉండి మంచి వాళ్లు అయితే నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి. నాకు నచ్చితే కచ్చితంగా రిప్లై ఇస్తాను. ప్రేమలో ఓపిక ఉండాలి. టీనేజ్ లవ్ వేరు. ఇప్పటి లవ్ వేరు. లవ్ లో ప్యూరిటీ ఉండాలి. నేను అదే కోరుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చింది రేఖ. ప్రస్తుతం ఈ హీరోయిన్ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.