
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ తాజా చిత్రం ‘రణబాలి’ చుట్టూ సోషల్ మీడియాలో పుకారు చక్కర్లు కొడుతోంది. షూటింగ్ సెట్స్‌లో విజయ్ హద్దు దాటి ప్రవర్తిస్తున్నాడని, తన కోసం ఏకంగా 5 నుండి 6 కారవాన్లు, 40-50 మంది
అసిస్టెంట్లను డిమాండ్ చేశాడంటూ ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఈ ఖర్చు భరించలేక నిర్మాతలు ‘ప్రొడ్యూసర్స్ కౌన్సిల్’ను ఆశ్రయించారనే వార్తలు కూడా వైరల్ అయ్యాయి. ఈ తప్పుడు ప్రచారంపై చిత్ర నిర్మాత, మైత్రి మూవీ మేకర్స్ అధినేత వై. రవిశంకర్ అఫీషియల్ ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు. విజయ్ దేవరకొండ అత్యంత ప్రొఫెషనల్‌గా వ్యవహరించే హీరో అని... షూటింగ్లో ఇప్పటివరకు ఎలాంటి సమస్యలు తలెత్తలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ వార్తలన్నీ కేవలం కొందరు కావాలనే క్రియేట్ చేసినవని చెప్పారు. అటు విజయ్ పీఆర్ టీమ్ కూడా ఈ రూమర్లను సృష్టించిన బాధ్యులపై సైబర్ క్రైమ్ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది.ఇక రూమర్ల సంగతి పక్కనబెడితే.. ‘రణబాలి’ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. ‘శ్యామ్ సింగ రాయ్’ ఫేమ్ రాహుల్ సాంకృత్యాయన్ డైరెక్షన్లో... 1854 నుంచి 1878 మధ్య కాలంలో బ్రిటిష్ పాలన నాటి వాస్తవ చారిత్రక సంఘటనల ఆధారంగా ఈ పీరియడ్ డ్రామా తెరకెక్కుతోంది. బ్లాక్ బస్టర్ హాలీవుడ్ మూవీ ‘ది మమ్మీ’ విలన్, నటుడు ఆర్నాల్డ్ వోస్లూ ఇందులో మెయిన్ విలన్‌గా నటిస్తున్నారు.ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన ఆయన భార్య రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’