బ్రోకోలి మైక్రోగ్రీన్స్ అంటే బ్రోకోలి మొక్కలు మొలకెత్తిన కొద్ది రోజులకే అంటే 8 నుంచి 10 రోజుల్లో కోసే ఆకుకూరలు. ఇవి పరిపక్వమైన బ్రోకలీ కంటే సుమారు 40 రెట్లు అధికంగా పోషకాలు, విటమిన్లు ఉంటాయి.
మైక్రోగ్రీన్స్ అన్నింటిలోకి ఇది శక్తివంతమైనది. దీని రుచి కూడా చాలా సౌమ్యంగా ఉంటుంది. ఇందులో సల్ఫోరాఫేన్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ చాలా అధిక మొత్తంలో ఉంటుంది.
అలాగే విటమిన్ ఏ, సీ, ఈ పుష్కలంగా ఉంటాయని NLM అధ్యయనం పేర్కొంది. ఇది శరీరాన్ని డిటాక్సిఫై చేయడానికి, క్యాన్సర్ కణాలతో పోరడటానికి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి అద్భుతంగా పనిచేస్తుంది. వీటిని క్యాబేజీ, క్యారెట్ తురుము, నిమ్మరసంతో కలిపి సలాడ్‌లా తింటే చాలా బాగుంటుంది.
ఆవాల మైక్రోగ్రీన్స్ అంటే ఆవాల గింజలు మొలకెత్తిన వారం నుంచి 15 రోజుల్లో పెరిగే చిన్నపాటి ఆకుకూరలు. ఇవి చాలా రుచికరంగా ఉండటమే కాకుండా విటమిన్ ఏ, సీ, ఈ, కాల్షియం, ఐరన్ వంటి పోషకాలకు అద్భుతమైన మూలాలు. పరిపక్వత చెందిన ఆకుకూరలతో పోలిస్తే వీటిలో ఎక్కువ మొత్తంలో విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి.
ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. శరీరాన్ని డీటాక్సిఫై చేస్తాయి. అలాగే కాలేయ ఆరోగ్యానికి కూఆడ మంచివి. కీరా, టమోటా ముక్కలతో పాటు కొద్దిగా ఆలివ్ ఆయిల్, సాల్ట్, పెప్పర్, నిమ్మరసం వేసి ఈ మైక్రోగ్రీన్స్‌తో సలాడ్ చేసుకోవచ్చు.
వీటిని కూడా ముల్లంగి విత్తనాల నుంచి మొలకెత్తిన వారం పది రోజుల మొక్కలు. ఇవి కొంచెం ఘాటుగా మిరియాల రుచిని కలిగి ఉంటాయి. వీటిలో విటమిన్ సీ, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటి కాండాలు ఎరుపు లేదా గులాబీ రంగులో ఉండి సలాడ్‌కు మంచి రంగును ఇస్తాయి. ఇవి రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. చర్మ ఆరోగ్యానికి, జుట్టు కుదుళ్లు దృఢంగా కావడం కోసం కూడా మంచిది. వీటిని ఉడికించిన శనగలు, పచ్చబఠానీలతో పాటు సలాడ్‌లో కలుపుకుని తినొచ్చు.
ఇవి చాలా బలవర్ధకమైనవి. ఇవి తియ్యటి రుచితో పాలకూర లాంటి ఆకృతిని కలిగి ఉంటాయి. వీటిలో ఏ, సీ, ఈ విటమిన్లు, క్యాల్షియం, జింక్, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. గుండె ఆరోగ్యానికి, జీర్ణక్రియకు, ఎముకల బలానికి, కండరాల ఆరోగ్యానికి, హార్మోన్ల సమతుల్యతకు ఇవి చాలా మంచివి. ఇది కంప్లీట్ ప్రొటీన్ సోర్స్. ఇందులో అన్నీ రకాల ఎసెన్షియల్ అమైనో ఆమ్లాలు, విటమిన్ బీ కాంప్లెక్స్, జింక్, కాల్షియం ఉంటాయి. వీటిని పనీర్ లేదా టోఫు ముక్కలు, అవకాడో, సన్‌ఫ్లవర్ మైక్రోగ్రీన్స్ కాంబినేషన్ చాలా బాగుంటుంది.
ఇవి తోటకూర విత్తనాలు వేసిన రెండు వారాల్లో కోతకు వచ్చే లేత మొక్కలు. తోటకూరలో ఉండే విటమిన్స్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో పుష్కలంగా ఉంటాయని రీసెర్చ్ గేట్ అధ్యయనం పేర్కొంది. ఇవి చూడటానికి అద్భుతమైన మెజెంటా, ఎరుపు రంగులో ఉంటాయి. సలాడ్‌కు రిచ్ లుక్ ఇస్తాయి.
వీటి రుచి చాలా సున్నితంగా, కొద్దిగా మట్టి వాసనతో కూడిన తీపిగా ఉంటుంది. ఇవి రక్తహీనతను తగ్గిస్తుంది. కంటిచూపును మెరుగుపరుస్తుంది. జుట్టు రాలడాన్ని అరికడుతుంది. స్వీట్ కార్న్, ఉల్లిపాయ ముక్కలు, తోటకూర మైక్రోగ్రీన్స్‌పై కొద్దిగా మిరియాల పొడి, నిమ్మరసం వేసుకుని తినొచ్చు.
ముఖ్య గమనిక: ఈ కథనంలోని సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, కొందరు నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా తెలియజేశాము. వీటిని ఎంత వరకు పాటించాలనేది, విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం. సమయం తెలుగు వీటిని ధృవీకరించడం లేదు.
రచయిత గురించికిషోర్ రెడ్డికిషోర్ రెడ్డి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 10 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2020లో సమయం తెలుగులో చేరిన కిషోర్ రెడ్డి లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన న్యూట్రిషియన్, డైట్ ప్లాన్, రోగాలు - లక్షణాలు, ఫిట్నెస్, ఇంటి చిట్కాలు, ఫ్యాషన్, హోమ్ డెకార్, రిలేషన్షిప్ వార్తలతో పాటు వివిధ ఆరోగ్య అంశాలపై ఆరోగ్య నిపుణులు, న్యూట్రిషనిస్ట్, డైటీషియన్లు, ఆయుర్వేద నిపుణులు ఇచ్చిన సలహాలు, సమాచారం ఆధారంగా విస్తృత స్థాయిలో వార్తల్ని రాశారు. అంతేకాకుండా క్లీవ్ ల్యాండ్ క్లినిక్, మాయో క్లినిక్, WHO, హార్వర్డ్ వంటి పరిశోధనలు ఆధారంగా కూడా కంటెంట్ అందించారు. ఈ సమాచారాన్ని నిజమో కాదో తెలుసుకోవడానికి నిపుణుల సలహా తీసుకోమని కూడా వివరించారు. ఈ ఆర్టికల్స్ పాఠకులకు అర్థమయ్యేలా సరళమైన భాషలో రాస్తారు.కిషోర్ రెడ్డి 2015లో సాక్షి జర్నలిజం స్కూల్లో జర్నలిజం కోర్సును పూర్తి చేశారు. అనంతరం సాక్షి న్యూస్ ఛానెల్లో (20.08.2016 నుంచి 23.03.2020 వరకు) సబ్ ఎడిటర్‌గా పనిచేశారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్, విద్య, ఉద్యోగం వార్తలు రాశారు. ముఖ్యంగా ఎడ్యుకేషన్ / జాబ్స్ సెక్షన్ చూసుకునేవారు. ఆ తర్వాత 02.04.2020 నుంచి సమయం తెలుగులో విద్య, ఉద్యోగ వార్తలతో పాటు టెక్నాలజీ న్యూస్, అడ్వర్టయిజ్‌మెంట్స్ కూడా రాశారు. ఖాళీ సమయంలో పుస్తకాలు చదవడం, ప్రముఖల ఇంటర్వ్యూలు చూడటం, కొత్త కొత్త అంశాల గురించి తెలుసుకోవడానికి ఆయన ఇష్టపడతారు.... ఇంకా చదవండి