
యూట్యూబ్, సోషల్ మీడియాలో తెలంగాణ పల్లె పాటలు ఏ స్థాయిలో సక్సెస్ అవుతున్నాయో చెప్పుకోవచ్చు. విడుదలైన గంటల్లోనే మిలియన్ వ్యూస్ అందుకుని దూసుకుపోతున్నాయి.
భాష అర్థం కాకపోయినా ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ పల్లె పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక ఫోక్ సాంగ్స్ ద్వారా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నవారిలో ఫోక్ డ్యాన్సర్ నాగ దుర్గ ఒకరు. ఆమె అందం, అభినయంతో, పల్లెటూరి అమ్మాయిల కనిపిస్తూ తన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తో తక్కువ సమయంలోనే విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా చెప్పాలంటే నాగ దుర్గ సాంగ్ వచ్చిందంటే యూట్యూబ్ లో కోట్లలో వ్యూస్ రావాల్సిందే అన్నట్లుగా మారింది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నాగదుర్గ మాట్లాడుతూ.. 'తిన్న తీరం పడతలే' అనే ఒకే ఒక్క ఫోక్ సాంగ్ ద్వారా రాత్రికి రాత్రే స్టార్డమ్ వచ్చిందని అన్నారు. ఈ పాట తర్వాత తనకు ఏకంగా 100 అవకాశాలు వచ్చాయని.. ఈ సాంగ్ తన లైఫ్ మార్చేసిందని అన్నారు.
ఎక్కువమంది చదివినవి : Cinema : ఇదెక్కడి డిమాండ్ రా బాబూ.. ప్రేమ, ద్రోహం, ప్రతీకారం.. ఓటీటీలో దూసుకుపోతున్న వెబ్ సిరీస్..
ఇదిలా ఉంటే.. నాగదుర్గ కేవలం ఫోక్ డ్యాన్సర్ మాత్రమే కాదు. ఆమె కూచిపూడి డ్యాన్సర్ కూడా. చిన్నప్పటి నుంచే కూచిపూడి నృత్యంలో శిక్షణ తీసుకున్న నాగదుర్గ.. కూచిపూడిలో మాస్టర్స్ పూర్తి చేసి, ప్రస్తుతం పీహెచ్డీ (PhD) చేయడానికి సిద్ధమవుతున్నానని తెలిపారు. అంతేకాకుండా తాను ఒక డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ నడుపుతూ దాదాపు 100 మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాట్లు చెప్పుకొచ్చింది. చిన్నతనంలోనే లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు చేతుల మీదుగా అవార్డు అందుకోవడం తన జీవితంలో మరువలేని అనుభూతి అని ఆమె పేర్కొన్నారు.
ఎక్కువమంది చదివినవి : Cinema : నిజమైన సంఘటనల ఆధారంగా సిరీస్.. ఓటీటీలో ట్రెండింగ్లో ఉన్న వెబ్ సిరీస్..
ఇంతకు ముందు కలివి వనం అనే సినిమాలో నటించింది నాగదుర్గ. ప్రస్తుతం టాలీవుడ్ నటుడు ప్రియదర్శి జోడిగా ఇడుపు కాయితం అనే సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఈ చిత్రాన్ని సుకుమార్, బన్నీ వాసు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ గురువారం రిలీజ్ చేసింది చిత్రయూనిట్. మొత్తానికి ఇప్పటివరకు ఫోక్ సాంగ్స్ ద్వారా యూట్యూబ్ సెన్సేషన్ అయిన నాగదుర్గ ఇప్పుడు వెండితెరపై కథానాయికగా అలరించేందుకు రెడీ అయ్యింది.
ఎక్కువమంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరో.. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్.. కానీ తెలుగులో అట్టర్ ప్లాప్.. కారణం ఇదే..
నాగదుర్గ లైఫ్ మార్చిన తిన్న తీరం పడతలే సాంగ్ మీరు చూసేయ్యండి..
ఎక్కువమంది చదివినవి : Rajanna Movie : రాజన్న సినిమాకు నాకు ఇచ్చిన రెమ్యునరేషన్ అంతే.. టాలీవుడ్ నటుడు..