
జోతిష్యశాస్త్రంలో రాహువును ఛాయాగ్రహంగా పరిగణిస్తారు.అత్యంత శక్తివంతమైన ఈ గ్రహం ప్రస్తుతం కుంభ రాశిలో ఉన్నాడు.జులై 4న శుక్రుడు సింహ రాశిలోకి అడుగుపెడతాడు. దీని వల్ల..
రాహువు- శుక్రుడు వ్యతిరేక దిశల్లో ప్రయాణిస్తారు.12 ఏళ్ల తర్వా ఏర్పడే అత్యంత శక్తివంతమైన యోగం ఏర్పడుతుంది. దీని వల్ల.. 5 రాశుల వారి జీవితాల్లో అద్బుతాలు జరగనున్నాయి.ఈ సమయంలో వీరు ఏ పని చేసినా విజయాలు లభిస్తాయి. ఊహించని విధంగా ఆర్థిక ఫలితాలు పొందుతారు.
జులై 4 తర్వాత మిథున రాశివారి లైఫ్ అద్భుతంగా మారుతుంది. ఉద్యోగం చేసేవారికి జీవితం అనుకూలంగా మారుతుంది. మీరు చేసిన పనిని ఉన్నతాధికారులు గుర్తిస్తారు. మంచి ప్రశంసలు అందుకుంటారు. కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఆర్థికంగా బాగా కలిసొస్తుంది. మీరు ఏదైనా సొంత పని చేస్తున్నట్లయితే.. దాని నుంచి మంచి ఆర్థిక లాభాలు పొందే అవకాశం కూడా ఉంది. పెళ్ల కాని వారి కోసం.. కోరుకున్న జీవిత భాగస్వామి లభించే అవకాశం ఉంది.
తుల రాశివారికి రాహు సంచారం మంచి అవకాశాలను తీసుకువస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తి అవుతాయి. కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. చేసే ప్రతి పనిలోనూ మంచి విజయం సాధిస్తారు. కుటుంబంలో ఏవైనా సమస్యలు ఉంటే అవి తొలగిపోతాయి. రాహు, శుక్ర గ్రహాల కారణంగా ఈ సమయంలో అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది.కొత్త ఆదాయ మార్గాలు వెతుక్కుంటూ వస్తాయి. పలు వైపు నుంచి చేతికి డబ్బు అందుతుంది. విదేశీ అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంది.
రాహువు, శుక్ర గ్రహాల కారణంగా ధనుస్సు రాశివారికి జులై నెలలో అద్భుతంగా ఉంటుంది. ఈ సమయంలో ఆదాయం రెట్టింపు అవుతుంది. కొత్త వాహనం లేదా ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది.ఈ సమయంలో మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కోరుకున్నవన్నీ లభిస్తాయి.
రాహు సంచారం కారణంగా వృశ్చిక రాశివారికి ఈ జులై నెలలో బాగుంటుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. పెట్టుబడుల నుంచి మంచి లాభాలు అందుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. కానీ.. అదే సమయంలో ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. గతంలో కొన్ని కారణాల వల్ల ఆగిపోయిన పనులు.. ఈ సమయంలో పూర్తి చేయగలుగుతారు.
మకర రాశివారికి ఈ జులై నెలలో చాలా బాగుంటుంది. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఊహించని ఆర్థిక లాభాలు కలుగుతాయి. వారసత్వంగా ఆస్తి కలిసొచ్చే అవకాశం ఉంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు అందుకుంటారు. అప్పుల బాధలు తీరిపోతాయి. వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది సరైన సమయం.