
కిడ్నీ క్యాన్సర్‌ను వైద్య పరిభాషలో ఒక నిశ్శబ్ద వ్యాధి" (సైలెంట్ డిసీజ్) అని పిలుస్తారు. దీనికి కారణం, ఈ వ్యాధి ఎలాంటి స్పష్టమైన లక్షణాలు చూపించకుండానే నెలల తరబడి, కొన్నిసార్లు సంవత్సరాల పాటు శరీరంలో...
కిడ్నీ క్యాన్సర్‌ను వైద్య పరిభాషలో ఒక నిశ్శబ్ద వ్యాధి" (సైలెంట్ డిసీజ్) అని పిలుస్తారు. దీనికి కారణం, ఈ వ్యాధి ఎలాంటి స్పష్టమైన లక్షణాలు చూపించకుండానే నెలల తరబడి, కొన్నిసార్లు సంవత్సరాల పాటు శరీరంలో పెరుగుతూ ఉంటుంది. కిడ్నీలో కణితి (ట్యూమర్) అభివృద్ధి చెందుతున్నా, చాలా మందికి ఆ విషయం తెలియకుండానే తమ రోజువారీ పనులు చేసుకుంటూ ఉంటారు. వ్యాధి లక్షణాలు స్పష్టంగా బయటపడే సమయానికి, అది ముదిరిపోయి ఉండే ప్రమాదం ఉంది. అప్పుడు చికిత్స కూడా చాలా సంక్లిష్టంగా మారుతుంది.కిడ్నీ క్యాన్సర్‌ను గుర్తించేందుకు అత్యంత ముఖ్యమైన, తొలి హెచ్చరిక మూత్రంలో రక్తం కనిపించడం. దీనిని వైద్యపరంగా 'హెమటూరియా' అంటారు. అయితే, మూత్రంలో రక్తం వస్తే అది కచ్చితంగా క్యాన్సర్ అని చెప్పలేం. కానీ, ఈ లక్షణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయవద్దని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ రక్తస్రావం దానంతట అదే ఆగిపోయినా లేదా నొప్పి లేకుండా వచ్చినా, వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి. తొలిదశలో వ్యాధిని గుర్తిస్తే, చికిత్స విజయవంతం అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.మూత్రంలో రక్తం ఎందుకు వస్తుంది?ఈ విషయంపై ఢిల్లీలోని సీకే బిర్లా హాస్పిటల్ యూరాలజీ కన్సల్టెంట్ డాక్టర్ రిషి రాజ్ వోహ్రా వివరిస్తూ.. "కిడ్నీలోని కణితులు నొప్పి లేదా ఇతర లక్షణాలు లేకుండానే నిశ్శబ్దంగా పెరుగుతాయి. కణితి పెరిగి కిడ్నీలోని మూత్రాన్ని సేకరించే వ్యవస్థను (పెల్విస్, కాలిసియల్ సిస్టమ్) ప్రభావితం చేసినప్పుడు మూత్రంలో రక్తం కనిపించడం మొదలవుతుంది. కొన్నిసార్లు ఈ డ్రైనేజ్ మార్గాల్లో మొదలయ్యే క్యాన్సర్ల