
ఇంటర్నెట్ డెస్క్: నటుడు విజయ్ దేవరకొండకు సంబందించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ ప్రచారం అవుతోంది. ‘రణబాలి’ (Ranabaali) సెట్స్‌లో 5 కారవాన్లు కావాలని కోరారని, అసిస్టెంట్లు కూడా ఎక్కువ మంది
ఉండాలని ఆయన డిమాండ్ చేసినట్లు ఆ వార్తల సారాంశం. దీనిని ఖండిస్తూ విజయ్ (Vijay Deverakonda) టీమ్ ప్రకటన విడుదల చేయగా.. తాజాగా ఈ అంశంపై నిర్మాత రవి స్పందించారు. అవి పూర్తిగా నిరాధారమైనవని తెలిపారు. షూటింగ్ సమయంలో అలాంటి సమస్యలేవీ రాలేదని స్పష్టం చేశారు. విజయ్ ఎప్పుడూ తన పనిపై అంకితభావంతో ఉంటారని ప్రశంసించారు.
ఇలాంటి వార్తలను ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని విజయ్ టీమ్ హెచ్చరించింది. ఇక రణబాలి విషయానికొస్తే.. విజయ్ దేవరకొండ - రష్మిక ప్రధానపాత్రల్లో రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. 1854-1878 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న సినిమా. 90శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాను సెప్టెంబరు 11న విడుదల చేసేందుకు అన్ని పనులు శరవేగంగా జరుగుతున్నాయని చిత్ర వర్గాలు తెలిపాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.