
ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వం వహించే ‘వడ చెన్నై-2’ చిత్రంలో స్టార్ హీరోలు శింబు, ధనుష్ నటించనున్నట్టు సమాచారం.
ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ (Vetrimaaran) దర్శకత్వం వహించే ‘వడ చెన్నై-2’ (Vada Chennai 2) చిత్రంలో స్టార్ హీరోలు శింబు (Simbu), ధనుష్ (Dhanush) నటించనున్నట్టు సమాచారం. ఆ దిశగా దర్శకుడు ప్రయత్నాలు మొదలుపెట్టారని కోలీవుడ్ వర్గాల సమాచారం. గతంలో ధనుష్ హీరోగా వచ్చిన ‘వడ చెన్నై’ తొలి భాగం ఘన విజయం సాధించింది. ఈ మూవీ ధనుష్ సినీ కెరీర్లోనే ఓ మైలురాయిగా నిలిచింది.
ఇపుడు దీనికి రెండో భాగాన్ని తెరకెక్కించే పనుల్లో దర్శకుడు వెట్రిమారన్ ఉన్నారు. భారీ బడ్జెట్తో రూపొందించే ఈ మూవీలో ధనుష్, శింబులను ఎంపిక చేయాలని దర్శకుడు భావిస్తున్నట్టు సమాచారం. ధనుష్ - శింబు కలిసి నటించి చాలా సంవత్సరాలైంది. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో ‘వడ చెన్నై-2’ రూపొందించాలని వెట్రిమారన్ గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు వినికిడి.