
తెలుగు చలన చిత్ర పరిశ్రమ స్థాయిని మార్చిన సినిమా అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు బాహుబలి. డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
బాహుబలి 1, 2 పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ క్రియేట్ చేశాయి. ఇందులో ప్రభాస్, అనుష్క, రానా ప్రధాన పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. అలాగే రమ్యకృష్ణ, నాజర్, తమన్నా, రోహిణి, సత్యరాజ్ ముఖ్య పాత్రలు పోషించారు. రెండు భాగాలుగా వచ్చిన ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో టాలీవుడ్ సత్తా చాటింది. ఇదివరకే ఈ మూవీ ఓటీటీలో అందుబాటులో ఉండగా.. తాజాగా ‘బాహుబలి. ది టార్చ్ బేరర్ ‘ నెట్ ఫ్లిక్స్ వేదికగా ఓటీటీ మూవీ లవర్స్ ముందుకు వచ్చింది. ఈ సినిమా స్ట్రీమింగ్ కు ముందు నెట్ ఫ్లిక్స్ ఓ వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. అందులో సినీ ప్రియులకు సర్ ప్రైజ్ ఇస్తూ బాహుబలి 3 ఉంటుందని అధికారికంగా చెప్పింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట తెగ వైరలవుతుంది.
ఎక్కువమంది చదివినవి : Cinema : నిజమైన సంఘటనల ఆధారంగా సిరీస్.. ఓటీటీలో ట్రెండింగ్లో ఉన్న వెబ్ సిరీస్..
అయితే ఆ వీడియోలో ప్ఱభాస్, రానా, అనుష్క ముచ్చట్లు పెడుతూ.. సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. ముఖ్యంగా ఈ వీడియోలో అనుష్క స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. చాలా కాలంగా మీడియాకు దూరంగా ఉంటున్న స్వీటీ.. ఫస్ట్ టైమ్ కెమెరా ముందుకు వచ్చింది. అలాగే చాలా సంవత్సరాల తర్వాత ప్రభాస్, రానా, అనుష్క కలిసి సరదాగా మాట్లాడుకోవడం చూసి తెగ మురిసిపోతున్నారు ఫ్యాన్స్. ఈ వీడియోలో ప్రభాస్, రానా, అనుష్క మాట్లాడుతూ.. ‘ప్రపంచం ఈ ప్రకటనను ఊహించలేదు. మీ అందరికోసం బాహుబలి మూడో భాగం రానుంది’ అంటూ చెప్పుకొచ్చారు. అలాగే ఇందులో ప్రభాస్ మాట్లాడుతూ.. ‘స్వీటీ నవ్వడం స్టార్ట్ చేస్తే దాదాపు 40 నిమిషాలు ఆపకుండా నవ్వుతుంది. ఆమె రోజూ సెట్స్ కు వచ్చేటప్పుడు ఈరోజు నవ్వుకూడదు అనుకుంటూ వచ్చేది.. నవ్వితే షూట్ మొత్తం ఆగిపోతుందని ఇంత పెద్ద సెట్ వేసిన నిర్మాతకు నష్టం కలుగుతుందని అనుకనేది’ అంటూ సరదాగా చెప్పుకొచ్చాడు ప్రభాస్.
ఎక్కువమంది చదివినవి : Cinema : ఇదెక్కడి డిమాండ్ రా బాబూ.. ప్రేమ, ద్రోహం, ప్రతీకారం.. ఓటీటీలో దూసుకుపోతున్న వెబ్ సిరీస్..
ఈ సినిమాకు తనకు ఎప్పటికీ ఒక ఎమోషనల్ జర్నీ అని అన్నారు. ఇక సత్యరాజ్ మాట్లాడుతూ.. సెట్ లో కాస్ట్యూమ్స్ చాలా ఉండేవని.. కనుచూపు మేరలో మొత్తం డ్రెస్ లు ఉండేవని.. అది చూసి ఆశ్చర్యపోయినట్లు చెప్పారు. ఇక ఇప్పుడు బాహుబలి సినిమా గురించి అధికారిక ప్రకటన రావడంతో మూవీ లవర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఎక్కువమంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరో.. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్.. కానీ తెలుగులో అట్టర్ ప్లాప్.. కారణం ఇదే..
ఎక్కువమంది చదివినవి : Rajanna Movie : రాజన్న సినిమాకు నాకు ఇచ్చిన రెమ్యునరేషన్ అంతే.. టాలీవుడ్ నటుడు..