
AP EAPCET-2026 ఫలితాల పైన ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. ఫలితాల కోసం లక్షలాది మంది విద్యార్ధులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఈ ఫలితాలు తొలుత ఈ నెల తొలి వారంలోనే విడుదల చేస్తారని భావించారు.
అయితే, విడుదల ఆలస్యం అవుతోంది. ఇందుకు అధికారులు స్పష్టమైన కారణాలను వెల్లడించారు. దీంతో, ఇప్పుడు ఫలితాల విడుదల కు దాదాపు ముహూర్తం ఖరారైంది. సీబీఎస్ఈ అభ్యర్ధుల మార్కుల నమోదు పూర్తయిన తరువాత ఈ ఫలితాల విడుదల కు తుది కసరత్తు కొనసాగుతోంది.ఆంధ్రప్రదేశ్ ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం కల్పించే ఏపీ ఈఏపీసెట్ (AP EAPCET) ఫలితాలపై కీలక సమాచారం అందుతోంది. ఇప్పటికే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ ఫలితాల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో రిజల్ట్స్ వాయిదా పడటంతో మరికొంత కాలం ఎదురుచూడాల్సి వచ్చింది. తాజాగా ఈ నెల 30న ఫలితాల విడుదలకు ముహూర్తంగా ఫిక్స్ చేసారు. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ 2026 ఫలితాలు జూన్ 1న విడుదల చేస్తామని గతంలో ప్రకటించారు. కానీ తాజా సమాచారం ప్రకారం జూన్ మూడో వారంలో ఈ ఫలితాలు వెలువడనున్నాయి. ఇంటర్మీడియట్ ఇంప్రూవ్‌మెంట్, సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ. ఆంధ్రప్రదేశ్ ప్రవేశ పరీక్షల నిబంధనల ప్రకారం, ఈఏపీసెట్ ర్యాంకును కేటాయించేటప్పుడు కేవలం ప్రవేశ పరీక్ష మార్కులను మాత్రమే కాకుండా, ఇంటర్మీడియట్‌లో వచ్చిన మార్కులకు 25 శాతం వెయిటేజీ కేటాయిస్తున్నారు.చర్లపల్లి నుంచి తిరుపతికి మరో రైలు- రూట్, షెడ్యూల్..!!ఈ నెల 30న ఫలితాల వెల్లడికి ఛాన్సర్యాంకులు కేటాయించాలంటే ఇంటర్మీడియట్‌ మార్కులూ తప్పనిసరి. పైగా ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం సెకండ్‌ ఇంటర్‌ విద్యార్థులకూ ఇంప్రూవ్‌మెంట్‌ రాసేందుకు అవకాశం కల్పించింది. లక్షకుపైగా విద్యార్థులు తమ మార్కుల మెరుగుదలకు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు రాశారు. ఈఏపీసెట్‌ ర్యాంకుల్లో వీరికి ఎట్టిపరిస్థితుల్లో అన్యాయం జరగకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ఫలితాలను వాయిదా వేసింది. జూన్‌ 18న ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల కావడంతో ఈఏపీసెట్‌ ఫలితాల విడుదలకు లైన్‌ క్లియర్‌ అయింది. అయితే, ఈ ఏడాది సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాల్లో సాంకేతికంగా కొన్ని ఇబ్బందులు తలెత్తడంతో ఈఏపీసెట్‌ ఫలితాల విడుదలపై మరోసారి సందిగ్ధత నెలకొంది. సీబీఎస్ఈ 12వ తరగతి రీవెరిఫికేషన్, రీవాల్యుయే షన్ లో మార్కులు పెరిగిన వ్యార్ధులు డిక్లరేషన్ ఫారమ్ ఈ నెల 27వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు ఆన్ లైన్ లో సమర్పించాలని ఈఏపీసెట్ కన్వీనర్ సూచించారు. ఈ మార్కుల నమోదు పూర్తయిన తరువాత ఫలితాలు ఇచ్చేందుకు రెండు రోజుల సమయం పడే అవకాశం ఉండటం తో.. ఈ నెల 30న ఫలితాలు విడుదల అయ్యే అవకాశం కనిపిస్తోంది.