
పల్నాడు జిల్లా మాచర్లలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులను హైదరాబాద్కు చెందిన కదిరి వెంకటేశ్వర్లు, కదిరి శారద, పిడుగు శారద, సత్యనారాయణగా గుర్తించారు.
నగరవనం వద్ద ఆగిఉన్న లారీని, తుఫాను వాహనం వెనక నుంచి ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. మృతదేహాలు వాహనంలోనే ఇరుక్కుపోయాయి. ఆ సమయంలో వాహనంలో డ్రైవర్ సహా 13 మంది ఉన్నట్టు పోలీసులు తెలిపారు. పామూరు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టు గుర్తించారు. మాచర్ల ప్రమాదంలో మృతులంతా హైదరాబాదు వాసులు |