
ప్రముఖ గేమ్ డెవలపర్ సంస్థ ‘బంగీ’ తమ కంపెనీలో భారీగా ఉద్యోగుల తొలగింపులను ప్రకటించింది. 2022లో సోనీ సంస్థ 3.6 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 30,000 కోట్లు) భారీ వ్యయంతో కొనుగోలు చేసిన ఈ స్టూడియో..
తమ వ్యయ నియంత్రణ, పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా కంపెనీకి చెందిన పాప్యులర్ గేమ్ ‘డెస్టినీ’ బృందంలోని అత్యధికులతో పాటు, ‘మారథాన్’ గేమ్ టీమ్‌లోని కొంతమంది ఉద్యోగులపై ఈ లేఆఫ్స్ వేటు పడింది.ఇటీవలి కాలంలో సంస్థ ఆశించిన స్థాయిలో 'డెస్టినీ 2' గేమ్ రాణించకపోవడమే ఈ లేఆఫ్స్‌కు ప్రధాన కారణమని జూన్ 25న విడుదల చేసిన అధికారిక ప్రకటనలో కంపెనీ స్పష్టం చేసింది. బంగీ సంస్థతో పాటు వీరికి సపోర్ట్ అందిస్తున్న సోనీ ఇంటరాక్టివ్ ఎంటర్టైన్మెంట్ సిబ్బంది కూడా ఈ తొలగింపుల బారిన పడ్డారు. ఈ సంక్షోభంపై బంగీ యాజమాన్యం సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. "గడిచిన కొన్నేళ్లుగా డెస్టినీ 2 గేమ్ మా అంచనాలను అందుకోవడంలో విఫలమైందనే నిజాన్ని మేము అంగీకరిస్తున్నాం. ఈ గేమ్ చివరి కంటెంట్ అప్డేట్ కూడా ముగిసింది. మా తదుపరి కొత్త ప్రాజెక్టులు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. అందుకే ప్రస్తుత పరిస్థితుల్లో ఇంత భారీ సిబ్బందితో కంపెనీని నడపడం సాధ్యం కావడం లేదు" అని ఆవేదన వ్యక్తం చేసింది. ప్లేస్టేషన్ స్టూడియోస్ అధినేత హెర్మెన్ హల్స్ట్ కూడా ఈ నిర్ణయం చాలా బాధాకరమైనదే అయినప్పటికీ.. కంపెనీ భవిష్యత్తు, దీర్ఘకాలిక లక్ష్యాల దృష్ట్యా తప్పలేదని పేర్కొన్నారు.దాదాపు పదేళ్ల పాటు