
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక శాతం మంది ఉపయోగించే మెసేజింగ్ సర్వీస్ యాప్ 'వాట్సాప్'. తాజాగా వాట్సాప్ వినియోగదారుల కోసం మెటా సంస్థ 'వాట్సాప్ ప్లస్' పేరుతో పెయిడ్ సర్వీసెస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
వ్యక్తిగత అభిరుచికి అనుగుణంగా థీమ్‌లు మార్చుకోవచ్చు
వాట్సాప్ లోగోను నచ్చినట్టు మార్చుకునే సదుపాయం
అవసరానికి అనుగుణంగా చాట్ జాబితాలను కస్టమైజ్ చేసుకునే సదుపాయం
వాట్సాప్‌లో సెట్టింగ్స్ విభాగానికి వెళ్లి సబ్స్క్రిప్షన్స్ ఎంపికలో వాట్సాప్ ప్లస్‌ను ఎంచుకుని చెల్లింపు పూర్తి చేస్తే సభ్యత్వం ప్రారంభమవుతుంది. ప్రస్తుతం ఈ సేవను దశలవారీగా విడుదల చేస్తున్నందున కొంతమంది వినియోగదారులకు వెంటనే కనిపించకపోవచ్చు.
వాట్సాప్ రూపాన్ని, అనుభవాన్ని తమ అభిరుచికి అనుగుణంగా మార్చుకోవాలనుకునే వారికి వాట్సాప్ ప్లస్ ఉపయోగపడుతుంది. సాధారణ సందేశాలు, కాల్స్ చాలు అనుకునేవారికి ఉచిత వెర్షన్లోనే అన్ని ముఖ్యమైన సేవలు అందుబాటులో ఉంటాయి.
మద్యం మత్తులో పెళ్లికి వచ్చిన వరుడు.. వధువు ఏం చేసిందంటే..
స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..