
Baahubali the Torch Bearer : బాహుబలి తెలుగు సినీ పరిశ్రమ స్థాయిని మార్చిన సినిమా. టాలీవుడ్ బాహుబలి కి ముందు బాహుబలికి తర్వాత అనే రేంజ్ లో ఈ సినిమా అందర్నీ మెప్పించింది.
బాహుబలి రెండు పార్టులు ఇండియాలోని సినీ పరిశ్రమలకు ఒక కొత్త దారిని ఏర్పాటు చేసాయి. ఈ సినిమాతో ప్రభాస్, రానా, అనుష్క, రాజమౌళి.. ఇలా సినిమాకు పనిచేసిన వారంతా పాన్ ఇండియా స్టార్స్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.
ఇప్పటికే బాహుబలి ఎటర్నల్ వార్ అని ఓ యానిమేషన్ సిరీస్ ని ప్రకటించి టీజర్ రిలీజ్ చేసారు. బాహుబలి పార్ట్ 3 కూడా ఉంటుందని రూమర్స్ వచ్చాయి. తాజాగా బాహుబలి: ది టార్చ్ బేరర్ అనే ఓ డాక్యుమెంటరీ సిరీస్ వచ్చేసింది. నెట్ ఫ్లిక్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ బాహుబలి: ది టార్చ్ బేరర్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది.
ఈ సిరీస్ నాలుగు ఎపిసోడ్స్ గా రిలీజ్ చేసారు. ఇందులో సినిమాకు పనిచేసిన ప్రభాస్, రాజమౌళి, రానా, అనుష్క, రమ్యకృష్ణ, సెంథిల్ కుమార్ తో పాటు పలువురు సాంకేతిక నిపుణులు సినిమా గురించి, వారి అనుభవాల గురించి మాట్లాడారు. అలాగే బాహుబలి మేకింగ్ ని చూపించారు. దీంతో ఈ సిరీస్ వైరల్ గా మారింది.
ఈ సిరీస్ లో రానా మాట్లాడుతూ.. ప్రపంచం ఈ ప్రకటనకు సిద్ధంగా లేదు కానీ మీ అందరికోసం బాహుబలి మూడో భాగం రానుంది అని ప్రకటించాడు. దీంతో బాహుబలి పార్ట్ 3 ఉంటుందని ఫిక్స్ అయిపొయింది. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఈ ప్రకటనతో ఫుల్ హ్యాపీగా ఉన్నారు. రానా బాహుబలి పార్ట్ 3 అంటూ అనౌన్స్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.