
దేశంలో ఇటీవల క్రెడిట్ కార్డుల వినియోగం అనేది పెరిగిపోతుంది. ఆఫర్లు, డిస్కౌంట్స్ కోసం దీనిని వాడేవారు ఎక్కువైపోతున్నారు. అయితే వీటిని వాడేవారికి అనేక ప్రయోజనాలు ఉంటాయి. అందులో ఒకటి రివార్డ్ పాయింట్లు.
అనగా.. మీరు క్రెడిట్ కార్డు నుంచి చేసే పేమెంట్స్‌కు రివార్డ్ పాయింట్లను అందిస్తూ ఉంటాయి. బ్యాంకును బట్టి ఈ పాయింట్లు మారుతూ ఉంటాయి.
సాధారణంగా కార్డు నుంచి ఖర్చు చేసే ప్రతీ రూ.100 లేదా రూ.150 ఖర్చుపై రివార్డ్ పాయింట్లను క్రెడిట్ కార్డు జారీ సంస్థలు అందిస్తూ ఉంటాయి. వీటి ద్వారా మీరు ఏదైనా వస్తువును తగ్గింపు ధరలో కొనుగోలు చేయవచ్చు. వీటిని రీడిమ్ చేసుకోవడం ద్వారా మీరు ప్రొడక్ట్స్ కొనుగోలుపై మీరు భారీగా డబ్బులను ఆదా చేసుకోవచ్చు. వీటిని ఈ పాయింట్లన రీడిమ్ చేసేముందు మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా భారీగా ప్రయోజనం పొందవచ్చు.
రీడిమ్ చేసుకునేముందు ఏ ప్రొడక్ట్స్‌పై ఎక్కువ తగ్గింపు వస్తుందనేది చెక్ చేసుకోవాలి. మీరు ఏదైనా వస్తువులను రివార్డ్ పాయింట్ల ద్వారా కొనుగోలు చేస్తుంటే తక్కువ తగ్గింపు రావొచ్చు. అదే హోటల్స్, విమాన టికెట్ల బుకింగ్స్, ఇతర వాటిపై ఎక్కువ తగ్గింపును పొందే అవకాశముంటుంది. ఇలాంటి సమయంలో పాయింట్ల ద్వారా చేసే లావాదేవీలకు ఎక్కువ విలువ ఎక్కడ వస్తుందనేది పరిశీలించండి.
కొన్ని సంస్థలు రివార్డ్ పాయింట్లను క్రెడిట్ కార్డు బిల్లులో సర్దుబాటు చేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. దీంతో ఒకసారి వీటి గురించి కూడా తెలుసుకోండి. ఇక రివార్డ్ పాయింట్ల విషయంలో కొన్ని బ్యాంకులు ఆన్లైన్లో చేసే షాపింగ్‌పై ఎక్కువ పాయింట్లను అందిస్తాయి. ఇక మరికొన్ని కార్డులు రెస్టారెంట్స్, ఇంధనం, ప్రయాణాలపై చేసే ఖర్చుకు అధిక పాయింట్లను అందిస్తాయి. దీంతో ఏ కార్డు ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తే ఎక్కువ పొదుపు చేసుకోవచ్చనేది చూడండి.
ఇక రివార్డ్ పాయింట్ల కోసం అనవసరపు ఖర్చులు చేయకండి. బోనస్, ప్రత్యేక ఆఫర్ల కోసం విచ్చలవిడిగా ఖర్చు చేస్తే నష్టం చేకూరుతుంది. రివార్డ్ పాయింట్ల కోసం ఎక్కువ ఖర్చులు చేస్తే బిల్లు కట్టలేక ఇబ్బందుల్లో పడతారు. దీని వల్ల రికార్డు పాయింట్ల వల్ల కలిగే లాభం కంటే.. బిల్లు సమయానికి కట్టకపోతే పడే వడ్డీ వల్ల అధిక నష్టం జరుగుతుంది. ఇక రివార్డ్ పాయింట్లు గడువు తేదీ తర్వాత ముగుస్తాయి. దీంతో వాటి నిబంధనలను చూడండి.