
ఈ చెట్టు కాయలే కాదు ఆకుల్లోనూ ఔషధమే.. ఇలా తింటే ఎన్ని లాభాలో..ఈ చెట్టు కాయలే కాదు ఆకుల్లోనూ ఔషధమే.. ఇలా తింటే ఎన్ని లాభాలో.. 26 June 2026 జామకాయలో డైటరీ ఫైబర్ చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది.
ఇది తిన్న తర్వాత కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఆరోగ్యకరమైన పద్ధతిలో బరువు తగ్గాలనుకునే వారికి జామకాయను ఆహారంలో తప్పక చేర్చుకోవాలి .
బరువు నియంత్రణ జామకాయలో విటమిన్ సి అత్యధికంగా లభిస్తుంది. ఇందులో ఉండే ప్రత్యేక ఖనిజాలు శరీరంలో తెల్ల రక్త కణాల ఉత్పత్తిని వేగవంతం చేస్తాయి. దీంతో రోగనిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా మనల్ని కాపాడుతుంది.
రోగనిరోధక శక్తి జామకాయలోని యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులోని పొటాషియం, ఫైబర్ గుణాలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను సమర్థవంతంగా అదుపు చేసి.. గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారిస్తాయి.
గుండెకు రక్షణ చాలా మంది మహిళలు పీరియడ్స్ సమయంలో కడుపు నొప్పితో బాధపడుతుంటారు. అలాంటి వారికి జామ ఆకు రసం ఒక అద్భుతమైన సహజ నివారణి. ఈ టైమ్‌లో ప్రతిరోజూ జామ ఆకు రసం లేదా కషాయాన్ని తాగడం వల్ల నొప్పి తగ్గుతుంది.
జామకాయలోని తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిల కంట్రోల్‌కు సాయపడతాయి. ముఖ్యంగా తిన్న తర్వాత జామ ఆకులను నీటిలో బాగా మరిగించి తయారు చేసుకున్న డికాషన్ తాగడం మంచిది.
జామపండులోని పీచుపదార్థం జీర్ణవ్యవస్థను శుభ్రపరిచి మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తుంది. అంతేకాకుండా జామ ఆకు రసం విరేచనాలు, కడుపు నొప్పికి కారణమయ్యే హానికరమైన బ్యాక్టీరియాను చంపేస్తుంది.
జీర్ణక్రియ మెరుగు వయసు పెరగడం వల్ల వచ్చే ముడతలను నివారించడంలో జామ కీలక పాత్ర పోషిస్తుంది. జామ ఆకు రసాన్ని క్రమం తప్పకుండా వాడటం వల్ల ముఖంపై ఉండే నల్లటి మచ్చలు, మొటిమలు, ఇతర మలినాలు తొలగి చర్మం కాంతివంతంగా మారుతుంది.
మెరిసే చర్మం జామ చెట్టు ఆకులను కేవలం రసంగానే కాకుండా ఉదయాన్నే లేత జామ ఆకులను శుభ్రం చేసి నేరుగా నమిలి మింగడం వల్ల నోటి దుర్వాసన తగ్గడమే కాకుండా పంటి నొప్పులు, చిగుళ్ల సమస్యలు కూడా నయమవుతాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్ జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి