
భాగ్యనగర ఆధ్యాత్మిక వైభవానికి, సంస్కృతికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవాలకు ఏర్పాట్లు షురూ అయ్యాయి. ఈ ఏడాది నవరాత్రి ఉత్సవాలకు వైభవంగా అంకురార్పణ జరిగింది.
నిర్జల ఏకాదశిని పురస్కరించుకుని ఖైరతాబాద్ గణేశ్ మండపం వద్ద వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా కర్ర పూజ నిర్వహించారు.
ఈ కార్యక్రమంతో విగ్రహ నిర్మాణ పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఈ ఏడాదితో 72వ వసంతంలోకి అడుగుపెడుతున్న ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్వాహకులు నిర్ణయించారు. ఈ ఏడాది ఏర్పాటు చేయనున్న విగ్రహ నమూనా పోస్టర్ను ఎమ్మెల్యే దానం నాగేందర్, ఉత్సవ కమిటీ సభ్యులు ఆవిష్కరించారు.
ఈ ఏడాది ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ స్వామివారు భక్తులకు ఒక ప్రత్యేకమైన రూపంలో దర్శనమివ్వనున్నారు. శ్రీ పంచముఖ సంకటహర మహాగణపతి అవతారంలోగణేషుడు ఖైరతాబాద్ గణేష్ మంటపంలో కొలువుదీరనున్నాడు. పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ, పూర్తి పర్యావరణహితంగా మట్టితో 69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో ఈ ఏడు గణేష్ విగ్రహం రూపుదిద్దుకోనుంది. స్వామివారికి ఉండే ఐదు ముఖాలు ప్రకృతిలోని పంచభూతాలకు ప్రతీకగా నిలవనున్నాయని పండితులు చెబుతున్నారు. వచ్చే సెప్టెంబర్ 14వ తేదీన వినాయక చవితి పర్వదినం. ఆ రోజు నాటికి ఈ భారీ విగ్రహ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ఉత్సవ కమిటీ పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు చేసింది.
ఏపీలో కూటమి రెండేళ్ల పాలనపై సువేరా విశ్లేషణ.. అదే అవినీతి, అదే దోపిడీ!
.