
ఇల్లు కొనుక్కొనేవారిలో చాలామంది రుణాలకు బ్యాంకులను సంప్రదిస్తారు. ఎక్కడ తక్కువ వడ్డీకి రుణం ఇస్తారో చూసుకొని తీసుకొంటారు.
కొన్నేళ్లుగా వాయిదాలు చెల్లిస్తున్న వారికి, వేరే బ్యాంకులో తక్కువ వడ్డీ రేటు ఇస్తున్నారని తెలియగానే లాభంలా కనిపిస్తుంది. రుణం తీర్చేందుకు చాలా వ్యవధి ఉన్నప్పుడు బదిలీ మంచి వెసులుబాటే. కేవలం ప్రకటనల్లో కనిపించే వడ్డీ రేట్లనే చూసి నిర్ణయం తీసుకోకూడదు. అన్ని ఖర్చులూ కలిపాక డబ్బు ఆదా అవుతుందో, లేదో సరిచూసుకోవాలి. గృహరుణం తీసుకున్న బ్యాంకు నుంచి మారుతున్నారా? |