
ఝార్ఖండ్‌లో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకొంది. వ్యాను, ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరొకరికి తీవ్ర గాయాలు కాగా, అతన్ని రామ్‌గఢ్‌లోని సర్దార్ ఆసుపత్రికి...
ఝార్ఖండ్‌లో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకొంది. వ్యాను, ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరొకరికి తీవ్ర గాయాలు కాగా, అతన్ని రామ్‌గఢ్‌లోని సర్దార్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రామ్‌గఢ్ జిల్లాలోని రాజ్రప్ప సమీపంలో ప్రయాణికులతో వెళుతున్న వాహనాన్ని ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఝార్ఖండ్‌లో ఘోర ప్రమాదం: ఏడుగురి మృతి |