
సాకర్ క్రేజ్ ప్రపంచాన్ని ఊపేస్తోంది. టికెట్ల ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరినా, వీసా నిబంధనలు ఇబ్బంది పెడుతున్నా అభిమానుల ఉత్సాహం మాత్రం తగ్గలేదు.
అమెరికా, కెనడా, మెక్సికో దేశాల సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న 'ఫిఫా వరల్డ్ కప్ 2026' సరికొత్త చరిత్ర సృష్టించింది. ఫుట్‌బాల్ ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక మంది ప్రేక్షకులు హాజరైన టోర్నీగా ఇది సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ క్రమంలోనే 32 ఏళ్ల క్రితం నాటి రికార్డు తుడిచిపెట్టుకుపోయింది.న్యూజెర్సీలోని మెట్‌లైఫ్ స్టేడియంలో జూన్ 25న జర్మనీ, ఈక్వెడార్ దేశాల మధ్య జరిగిన గ్రూప్-ఈ మ్యాచ్ సందర్భంగా ఈ మైలురాయి నమోదైనట్లు ఫిఫా అధికారికంగా ప్రకటించింది. ఈ టోర్నీలో ఇప్పటివరకు జరిగిన 56 మ్యాచ్‌లకు కలిపి మొత్తం ప్రేక్షకుల సంఖ్య 36,05,357కు చేరింది. దీంతో 1994లో అమెరికాలోనే జరిగిన వరల్డ్ కప్‌లో నమోదైన పాత రికార్డు (35,87,538 మంది) బద్దలైంది. అప్పట్లో టోర్నీ మొత్తం మీద కేవలం 52 మ్యాచ్‌లు మాత్రమే జరగగా, ఈసారి జట్ల సంఖ్య 48కి పెరగడంతో మ్యాచ్‌ల సంఖ్య కూడా 104కు చేరింది. ఇంకా సగం కంటే ఎక్కువ మ్యాచ్‌లు మిగిలి ఉండటంతో.. టోర్నీ ముగిసే సమయానికి ఈ సంఖ్య దాదాపు రెట్టింపు అయ్యే అవకాశం ఉందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్‌లలో స్టేడియాలు సగటున 99 శాతానికి పైగా నిండిపోతుండటం విశేషం. జూన్ 16న జరిగిన నాలుగు గ్రూప్ మ్యాచ్‌లను ఏకంగా 2,81,000 మందికి పైగా వీక్షించి, ఒకే రోజు అత్యధిక మంది చూసిన మ్యాచ్‌లుగా సరికొత్త