
వివాహ వేడుకకు తాగి వచ్చిన వరుడికి వధువు తగిన బుద్ధి చెప్పింది. అందరి ఎదుటా ధైర్యంగా నిర్ణయం తీసుకుని ప్రశంసలు అందుకుంది. ఆమె నిర్ణయాన్ని జిల్లా కలెక్టర్ సైతం అభినందించారు.
వివాహ వేడుకకు తాగి వచ్చిన వరుడికి వధువు తగిన బుద్ధి చెప్పింది. అందరి ఎదుటా ధైర్యంగా నిర్ణయం తీసుకుని ప్రశంసలు అందుకుంది. ఆమె నిర్ణయాన్ని జిల్లా కలెక్టర్ సైతం అభినందించారు. రూ.5000 గౌరవ వేతనంతో ఆమెను కౌన్సెలరుగా నియమించారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లో జరిగింది (Chhattisgarh wedding).
ఛత్తీస్‌గఢ్‌లోని జాంజ్‌గిర్-చాంపా జిల్లాకు చెందిన 22 ఏళ్ల ముస్కాన్ ప్రధాన్ వివాహం జూన్ 23న సంత్ రామ్ అనే యువకుడితో జరగాల్సి ఉంది. వరుడు ఊరేగింపుతో వధువు ఇంటికి చేరుకున్నాడు. అయితే మద్యం మత్తులో ఉన్న వరుడు కారు దిగి సరిగా నిలబడలేని పరిస్థితి కనిపించింది. ఈ విషయం లోపల ఉన్న ముస్కాన్‌కు తెలిసింది. ఆమె వెంటనే బయటకు వచ్చి వరుడి చెంప ఛెళ్లుమనిపించింది. అతడితో పెళ్లి వద్దని తేల్చి చెప్పింది (Bride cancels wedding).
ముస్కాన్ నిర్ణయానికి ఆమె కుటుంబ సభ్యులు కూడా మద్దతుగా నిలిచారు (Drunk groom). దీంతో ఇరు వర్గాల నడుమ కాసేపు ఘర్షణ జరిగింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి వరుడి తరపు వారిని వెనక్కి పంపారు. వధువు తీసుకున్న నిర్ణయాన్ని ఆ జిల్లా కలెక్టర్ జనమేజయ్ మహోబే సైతం అభినందించారు. పదో తరగతితో ఆగిపోయిన ముస్కాన్ చదువు కొనసాగేందుకు సహకరిస్తామని, కుటుంబానికి ప్రభుత్వ పథకాలు మంజూరు చేస్తామని తెలిపారు.
బీఈడీ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ గుడ్ న్యూస్ మీ కోసమే!
హైపోథెర్మియా.. శరీర ఉష్ణోగ్రత తగ్గితే ప్రాణాపాయం!