
దేశవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన నెల్లూరు ‘రొట్టెల పండుగ’ నేడు (జూన్ 26) ఘనంగా ప్రారంభం కానుంది. అయితే, ఒక రోజు ముందు నుంచే భక్తుల కోలాహలం మొదలైంది.
స్వర్ణాల చెరువు ఒడ్డున ఉన్న చారిత్రక బారాషహీద్ దర్గా వేదికగా ఐదు రోజుల పాటు జరిగే ఈ వార్షిక మహోత్సవానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు దేశ విదేశాల నుంచి సైతం లక్షలాదిగా తరలివస్తున్నారు. దీంతో స్వర్ణాల చెరువు కళకళలాడుతోంది. కులమతాలకు అతీతంగా, హిందూ-ముస్లిం ఐక్యతకు నిలువెత్తు రూపంగా నిలిచే ఈ పండుగ కోసం జిల్లా యంత్రాంగం అన్ని రకాల భారీ ఏర్పాట్లు పూర్తి చేసింది.చారిత్రాత్మక నేపథ్యం – నమ్మకంబారాషహీద్ దర్గాకు దాదాపు 415 సంవత్సరాల ఘనమైన చరిత్ర ఉంది. ఒక గొప్ప ఆశయం కోసం ప్రాణత్యాగం చేసిన 12 మంది అమరవీరుల స్మృత్యర్థం ఈ దర్గా నిర్మితమైంది. గతంలో ఆర్కాటు నవాబు భార్య తీవ్ర అనారోగ్యానికి గురికాగా, ఈ దర్గాను దర్శించుకున్న తర్వాత ఆమె పూర్తిగా కోలుకున్నారని చరిత్ర చెబుతోంది. దానికి కృతజ్ఞతగా నవాబు దంపతులు స్వర్ణాల చెరువు వద్ద భక్తులకు రొట్టెలను పంపిణీ చేశారు.నాటి నుంచి ఈ సంప్రదాయం ఒక ఆచారంగా మారింది. తమ కోర్కెలు (ఉద్యోగం, వివాహం, ఆరోగ్యం, సంతానం, విద్య, వ్యాపారం మొదలైనవి) నెరవేరిన భక్తులు స్వర్ణాల చెరువులో దిగి మొక్కుబడిగా రొట్టెలను సమర్పిస్తారు (ఇస్తారు). కొత్తగా కోర్కెలు కోరుకునే వారు ఆ రొట్టెలను అందుకుంటారు (పుచ్చుకుంటారు). ఈ రొట్టెల మార్పిడే ఈ పండుగలోని ప్రధాన ఆకర్షణ. 2015లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ వేడుకను