
తుంగభద్ర గేట్ల పునరుద్ధరణ పనులు చరిత్రలో నిలుస్తాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. మనందరి కష్టాలు, సమస్యలు తెలిసిన నాయకుడు సీఎం చంద్రబాబు అని ప్రశంసించారు.
ఇంటర్నెట్ డెస్క్, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): తుంగభద్ర గేట్ల పునరుద్ధరణ పనులు చరిత్రలో నిలుస్తాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (Telangana CM Revanth Reddy) వ్యాఖ్యానించారు. మనందరి కష్టాలు, సమస్యలు తెలిసిన నాయకుడు సీఎం చంద్రబాబు అని ప్రశంసించారు. కర్నూలు, అనంతపురం రైతుల సమస్యలు నాకు తెలుసు అని చెప్పుకొచ్చారు. పాలమూరు వలసల గురించి తనకు అవగాహన ఉందని తెలిపారు. మూడు రాష్ట్రాల కరువు జిల్లాలకు ఇది పరిష్కారం చూపబోతోందని పేర్కొన్నారు.ఈరోజు(గురువారం) తుంగభద్ర డ్యాం కొత్త స్పీల్ వే గేట్లు ప్రారంభించారు. కర్ణాటక కొప్పల్ జిల్లా మునీరాబాద్ బహిరంగ సభలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు.
మూడు రాష్ట్రాల మధ్య నీటి సమస్య పరిష్కారానికి అడుగులు పడుతున్నాయని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. నీటి సమస్యలు పరిష్కరించకపోవడంతో నీరు సముద్రం పాలవుతోందని చెప్పారు. మూడు రాష్ట్రాల మధ్య నీటి చర్చలు కొలిక్కి వచ్చాయని అన్నారు. తుంగభద్ర నుంచి 10 టీఎంసీల నీరు మాకు రావడం లేదని చెప్పారు. RDS కింద రైతులకు న్యాయం జరగాలని మేం ఆశిస్తున్నామన్నారు. చరిత్రలో ఈ రోజు సువర్ణ అక్షరాలతో నిలిచిపోతుందని తెలిపారు. తమకు పంచాయితీలు వద్దని.. పరిష్కారం కావాలని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు.