
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది.
ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Rahu Ketu Transit Effect On Zodiac: మానవ జీవితంలో నవగ్రహాల స్థానాలకు, వాటి సంచారానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది.. జాతకంలో గ్రహాల స్థితి బాగుంటే సామాన్యుడు కూడా రాత్రికి రాత్రే అపర కుబేరుడు కాగలడని జ్యోతిష్య శాస్త్రం చెబుతూ వస్తోంది.. ముఖ్యంగా ఛాయా గ్రహాలుగా పిలిచే.. రాహువు, కేతువుల ప్రభావం మానవ జీవితాలపై చాలా ఎక్కువగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.. ఈ క్రమంలోనే త్వరలోనే జరగబోయే రాహు-కేతువుల మహా సంచారం కారణంగా మొత్తం 12 రాశుల వారి జీవితాల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.. అయితే, ప్రత్యేకంగా ఐదు రాశుల వారికి ఈ ఊహించని అదృష్టంతో పాటు ఆర్థిక పురోగతి, అఖండ విజయాలు చేకూరుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు..
డిసెంబర్ 5న మహా అద్భుతం.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. రాహు-కేతువులు ఎల్లప్పుడూ వక్ర మార్గంలో ఒక గ్రహం నుంచి ఇతర గ్రహంలోకి ప్రయాణం చేస్తూ ఉంటాయి.. ప్రతి 18 నెలలకు ఒకసారి రాశి మారుతుంటారు. రాబోయే డిసెంబర్ 5వ తేదీన రాహువు కుంభ రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించనుండగా.. అదే రోజున కేతువు సింహ రాశి నుంచి కర్కాటక రాశిలోకి సంచారం చేయబోతోంది.. ఈ మార్పు వల్ల కింది ఐదు రాశుల వారు విశేష ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
ఈ రాశులవారికి బంపర్ లాభాలు: 1.మేష రాశి (Aries) రాహువు ఈ సమయంలో కర్మ స్థానంలోకి సంచారం చేయబోతున్నాడు. కాబట్టి ఈ సమయంలో వృత్తితో పాటు ఉద్యోగ రంగాల్లో అపారమైన విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా వీరికి కీర్తి ప్రతిష్టలు, సమాజంలో ప్రభావం పెరుగుతాయి. ఉన్నత పదవులు లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగాలు, రాజకీయాలు లేదా మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నవారికి ఇది సువర్ణ కాలంగా మారబోతోందని జ్యోతిష్యులు చెబుతున్నారు. వీరికి ఈ సమయంలో నిలిచిపోయిన ప్రాజెక్టులు వేగంగా పూర్తవుతాయి.
2. వృషభ రాశి (Taurus) వృషభ రాశి వారికి రాహువు తొమ్మిదవ స్థానంలో ప్రవేశించబోతున్నాడు. అలాగే కేతువు మూడో స్థానంలో ఉంటాడని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ గ్రహాల అనుకూలత వల్ల పెండింగ్‌లో ఉన్న పనులన్నీ వేగంగా, ఎంతో సులభంగా పూర్తవుతాయి.. ఉన్నత చదువులు చదవాలనుకునే వారికి, విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే వారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారాన్ని విస్తరించాలనుకునే వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది.. ఉద్యోగస్తులకు పెద్ద ఎత్తున పదోన్నతులు లభించే అవకాశాలు ఉన్నాయి..
3. సింహ రాశి (Leo) సింహ రాశి వారికి రాహువు ఆరో స్థానంలో ఉండడం వల్ల.. కేతువు పన్నెండో స్థానంలో ఉండడంతో అద్భుతమైన లాభాలు కలుగుతాయి. దీనివల్ల న్యాయపరమైన వివాదాలు లేదా ఆఫీసులో ఉండే మనస్పర్ధల నుంచి విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీర్ఘకాలికంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. విదేశీ సంబంధాలు లేదా వ్యాపారాల ద్వారా మంచి లాభాలు ఆర్జించే అవకాశాలు కనిపిస్తున్నాయి..
4. కన్యా రాశి (Virgo) కన్యా రాశి వారి జాతకంలో రాహువు ఐదో స్థానంలో.. కేతువు లాభ స్థానమైన పదకొండో స్థానంలో ఉండడం కారణంగా అద్భుతమైన లాభాలు కలుగుతాయి.. ఈ గ్రహ సంచారాలతో వీరికి ఊహించని విధంగా ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కొత్త ఆలోచనలు, సృజనాత్మకత పెంపొందుతాయి. నైపుణ్యాల వల్ల కార్యాలయంలో ప్రత్యేక గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి..
5. మీన రాశి (Pisces) మీన రాశి వారికి రాహువు ఆదాయ స్థానంలో ఉండడం వల్ల వీరికి అద్భుతమైన లాభాలు కలుగుతాయి.. ఇది ఆర్థికంగా అత్యంత లాభదాయకమైన సమయంగా భావించవచ్చు.. మీ ఆదాయం అకస్మాత్తుగా పెరుగుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీర్ఘకాలికంగా ఉన్న కోరికలు, ఆశయాలు నెరవేరుతాయి.. సమాజంలో పెద్దలతో పరిచయాలు, మీ నెట్వర్క్ విస్తరించడం వల్ల భవిష్యత్‌లో అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.