
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన...
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Leopard enters house in Tamil nadu nilgiris: సాధారణంగా అడవులకు దగ్గరగా ఉన్న జనావాసాల్లోకి తరచుగా క్రూర మృగాలు వస్తుంటాయి. ఈ క్రమంలో ఇటీవల తరచుగా చిరుత పులులు, ఎలుగు బంట్లు, పాములు, కొండ చిలువలు, ఏనుగులు జనాలపై దాడులు చేస్తున్నాయి. ముఖ్యంగా ఇవి రాత్రిపూట ఎక్కువగా సంచరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడులోని నీలగిరి ప్రాంతంలో ఉన్న మసినగుడి సమీపంలో ఉన్న మోయార్లోని సెల్వప్ప కాలనీలో ఒక చిరుత రాత్రి పూట కుక్కను తరముకుంటూ ఒక ఇంట్లోకి దూరిపోయింది. ఇంతలో అలికిడి విన్న ఆ ఇంటి యజమాని చాకచక్యంగా గదిని బైట నుంచి లాక్ వేశాడు. దీంతో ఆ ఇంట్లోని వారు ప్రాణాలు దక్కినట్లైంది. లోపల చిక్కుకున్న చిరుత కోపంతో ఊగిపోయింది.
ఇంటి పక్కన ఉన్న కిటికి నుంచి దాన్ని చూడగా అది కోపంతో పలు మార్లు దాడికి యత్నించింది. కిటికి గుండా కోపంతో తన పదునైన పంజాతో దాడులు చేస్తే జనాల్ని భయపెట్టింది. ఆ తర్వాత ఆ ఇంటిలోని వ్యక్తి ఫారెస్ట్ సిబ్బందికి సమాచారం అందించాడు. దీంతో రంగంలోకి దిగిన ఫారెస్ట్ సిబ్బంది చిరుతను బంధించడానికి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.
Read more: Snake Video: అదేమన్నా నీ బాయ్ ఫ్రెండా..?.. కోబ్రాను ముద్దులతో ముంచెత్తుతున్న యువతి.. వీడియో వైరల్..
వాళ్లు కూడా చిరుతను చూసి ఇది చాలా భయంకరంగా దాడి చేస్తుందని చెప్పారు. నీలగిరి ప్రాంతంలో సమీపం చుట్టు దట్టమైన అడవులు ఉంటాయి. ఈ క్రమంలో తరచుగా అడవుల నుంచి చిరుతలు, ఎలుగుబంట్లు జనావాసాల్లోకి వస్తాయి. అయితే.. ఇంట్లోకి దూరిన చిరుతను చూసేందుకు చుట్టుపక్కల వారు భారీగా తరలి వచ్చారు. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.