
రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Jangaon Tragedy Toddler Drowns In Water Sump: ఒకే ఇంట్లో ఒకే రోజు ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. జనగామ జిల్లా కేంద్రంలో కొన్ని గంటల వ్యవధిలోనే ఈ ఘోరం జరిగింది. కంటికి రెప్పలా కాపాడుకున్న రెండు ఏళ్ల చిన్నారి, ప్రమాదవశాత్తు ఇంట్లో ఉన్న నీటి సంపులో పడి మృతి చెందగా, ఆ విషయం తెలియగానే ఆమె నానమ్మ గుండెపోటుతో కుప్పకూలిపోయింది. నిన్న అంబేద్కర్ నగర్లో జరిగిన ఈ హృదయ విదారక ఘటనతో ఆ గ్రామం అంతా విషాదంలో మునిగిపోయింది.
పోలీసుల సమాచారం ప్రకారం, జనగాం జిల్లాలోని అంబేద్కర్ నగర్లో నివసించే ఈ కుటుంబానికి చెందిన ఆరు నెలల పసిపాప ప్రియాన్షు ఆడుకుంటోంది. అందరూ పాప ఆడుకుంటుంది కదా.. అనుకున్నారు. కానీ, అనుకోని ఘోరమే జరిగింది.. అందరి కళ్ళు గప్పి తెరిచి ఉన్న నీటి సంపు వద్దకు వెళ్ళింది పాప. దీన్ని వెంటనే కుటుంబ సభ్యులు గమనించలేదు. అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదవశాత్తు పాప ఉన్నట్టుండి ఆ నీటి సంపులో పడిపోయింది. జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. ఆ తర్వాత కాసేపటి పాప కనిపించకపోయేసరికి కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు వెతక సాగారు.. ఎంతకీ పాప ఆచూకీ లభించలేదు. దీంతో అనుమానం వచ్చి వెంటనే ఇంట్లో ఉన్న నీటి సంపు తెరచి చూశారు. సంపులో చిన్నారి తేలుతూ కనిపించింది. వెంటనే పాపను బయటకు తీసి ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆ చిన్నారి ప్రాణం పోయిందని వైద్యులు ధ్రువీకరించారు.
కళ్ల ముందే ఆడుకుంటున్న చిన్నారి ఇలా నీటి సంపులో పడి మరణించడంతో ఇల్లంతా దుఃఖంతో నిండిపోయింది. మరోవైపు, మనవరాలి మృతదేహాన్ని చూసి తట్టుకోలేక పాప నానమ్మ నాగమ్మ (65) తీవ్రంగా విలపిస్తూ, గుండెపై చేయి వేసుకుని బోరున ఏడ్చింది. దీంతో ఒక్కసారిగా నాగమ్మ కూడా కుప్పకూలిపోయింది. వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు ఆమెను రక్షించే ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది.. నాగమ్మ కూడా తుదిశ్వాస విడిచింది. ఇలా ఒకే ఇంట్లో మనవరాలు, నానమ్మ చనిపోవడంతో ఆ కుటుంబంతో పాటు కాలనీ అంతా విషాదంలో మునిగిపోయింది.
ఘటనపై సమాచారం అందుకున్న జనగాం పోలీసులు, సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే ఆ చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషాదం స్థానికంగా కలకలం రేపింది. ఇంటి ఆవరణలో నీటి సంపులు ఉంటే, పిల్లల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని, అవి ఎల్లప్పుడూ మూసి ఉండేలా చూసుకోవాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. చిన్నపిల్లలు ఉన్నప్పుడు పెద్దలు అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.