
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది.
ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Venus Transit Effect On Zodiac Latest News: జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత శుభప్రదమైన గ్రహాలుగా భావించే శుక్రుడు అతి త్వరలోనే ఒక అరుదైన సంచారం చేయబోతున్నాడు. ఒకే రోజు శుక్ర గ్రహం రాశితో పాటు నక్షత్ర సంచారం చేయబోతోంది. జ్యోతిష్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. శుక్రుడి ఈ అరుదైన గ్రహ చలనం కారణంగా కొన్ని రాశుల వారి జీవితాల్లో ఊహించని సానుకూల మార్పులు రాబోతున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో 5 రాశులవారికి ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. కోరుకున్న కొరికలు నెరవేరడమే కాకుండా అనుకున్న పనుల్లో అద్భుతమైన విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి అద్భుతమైన లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
సుఖసంతోషాలు, ప్రేమ, ఐశ్వర్యం, శృంగారం, విలాసవంతమైన జీవితానికి కారకుడైన శుక్రుడి ఈ డబుల్ ట్రాన్సిట్ వల్ల ఆయా రాశుల వారి ఆర్థిక స్థితి, ప్రేమ జీవితం, దాంపత్య బంధం, కెరీర్, సామాజిక గౌరవం విపరీతంగా పెరుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా జీవితంలో అద్భుతం జరుగుతుంది..
ఈ క్రింది రాశులవారికి బంపర్ జాక్‌ఫాట్: 1. వృషభ రాశి (Taurus): శుక్రుడి శుభ ప్రభావంతో వృషభ రాశి వారికి ఆర్థికంగా భారీ పురోగతి లభిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా చాలా కాలంగా నిలిచిపోయిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి.. వ్యాపారస్తులకు సరికొత్త అవకాశాలు తలుపుతట్టే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో సుఖశాంతులు ఊహించని స్థాయిలో పెరుగుతాయి..
2. మిథున రాశి (Gemini): ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న మిథున రాశి వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉండబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. నూతన ఆదాయ వనరులు లభించడమే కాకుండా.. ఆర్థిక పరిస్థితులు ఊహించని స్థాయిలో మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రేమికుల మధ్య బంధం మరింత బలపడే అవకాశాలు కూడా ఉన్నాయి..
3. సింహ రాశి (Leo): సమాజంలో సింహ రాశి వారి గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. కార్యాలయంలో కీర్తి ప్రతిష్టలతో పాటు ఉన్నతాధికారుల పూర్తి సపోర్ట్ కూడా అద్భుతంగా పెరుగుతుంది.. గతంలో చేసిన పెట్టుబడుల నుంచి ఊహించని లాభాలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
4. తులా రాశి (Libra): తులా రాశికి అధిపతి శుక్రుడే కావడం వల్ల ఈ రాశి వారికి ఈ సమయం అత్యంత అదృష్టాన్ని అందిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.. దాంపత్య జీవితంలో ఆనందం విపరీతంగా పెరుగుతుంది.. కొత్త ఇల్లు, భూమి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
5. మీన రాశి (Pisces): మీన రాశి వారికి ఈ సమయంలో అదృష్టం పూర్తిగా ఊహించని స్థాయిలో పెరుగుతుంది.. ఆర్థికంగా పురోగతి సాధించడంతో పాటు.. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లేదా అదనపు బాధ్యతలు దక్కే అవకాశం ఉందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. సమాజంలో మంచి గుర్తింపు కూడా లభిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.