
బంగారం, వెండి కొనుగోలు చేసేవారికి భారీ గుడ్ న్యూస్. గరువారం ధరలు భారీగా దిగొచ్చాయి. ఒకేసారి రూ.2,780 మేర పడిపోయాయి. ఒకేసారి 7 నెలల కనిష్టానికి కుప్పకూలాయి.
గత కొద్ది వారాలుగా పసిడి ధరలు పతనమవుతూ వస్తోన్నాయి. పెళ్లిళ్ల సీజన్ మొదలవ్వగా.. ఈ క్రమంలో ధరలు కుప్పకూలడం కొనుగోలుదారులకు కాస్త ఉపశమనంగా చెప్పవచ్చు. ఈ పతనం తర్వాత గురువారం దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం.
దేశీయ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,40,130 వద్ద కొనసాగుతోండగా.. గురువారం ఒక్కరోజే రూ.2780 పడిపోయింది. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,28,450 వద్ద ట్రేడవుతోండగా.. నేడు ఒక్కొరోజే రూ.2550 తగ్గింది. హైదరాబాద్లో 24 క్యారెట్ల రేటు రూ.1,40,130గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,28,450 వద్ద ట్రేడవుతున్నాయి.
చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,350గా ఉండగా.. గురువారం రూ.2290 తగ్గాయి. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,31,400 వద్ద కొనసాగుతుండగా.. నేడు రూ.2100 తగ్గుముఖ పట్టాయి. బెంగళూరులో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,40,130 వద్ద ట్రేడవుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,28,450గా ఉంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,40,280 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,28,600గా ఉంది. అటు వెండి ధరలు కూడా భారీగా పడిపోయాయి. ఢిల్లీలో ప్రస్తుతం కేజీ సిల్వర్ ధర రూ.2.35 లక్షలుగా ఉంది. ఇది నిన్న రూ.2.45 లక్షల వద్ద ఉంది. అంటే నిన్నటితో పోలిస్తే రూ.10 వేలు తగ్గింది.
ఇక హైదరాబాద్లో కేజీ సిల్వర్ ధర రూ.2.30 లక్షలుగా ఉంది. బుధవారం రూ.2.40 లక్షల వద్ద ఉండగా.. ఇవాళ ఒక్కరోజే రూ.10 వేలు పడిపోయింది. చెన్నైలో కేజీ వెండి ధర బుధవారం రూ.2.40 లక్షలుగా ఉండగా.. గురువారం రూ.2.30 లక్షలకు కుప్పకూలింది. నిన్నటితో పోలిస్తే నేడు రూ.10 వేలు తగ్గుముఖం పట్టింది.