
దక్షిణ ఇరాన్‌లోని మినాబ్‌లో పాఠశాలపై జరిగిన దాడిలో అమెరికా పాత్ర ఉందంటూ వస్తున్న వార్తలను డొనాల్డ్ ట్రంప్ ఖండించారు. ఈ దాడికి ఎవరు బాధ్యులో ఎప్పటికీ తెలియకపోవచ్చునని ఆయన తెలిపారు.
వాషింగ్టన్, జూన్ 25: దక్షిణ ఇరాన్‌లోని మినాబ్‌లో పాఠశాలపై జరిగిన దాడిలో అమెరికా పాత్ర ఉందంటూ వస్తున్న వార్తలను డొనాల్డ్ ట్రంప్ ఖండించారు. ఈ దాడికి ఎవరు బాధ్యులో ఎప్పటికీ తెలియకపోవచ్చునని ఆయన తెలిపారు. బుధవారం వాషింగ్టన్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విలేకర్లతో మాట్లాడారు. ఈ సమస్యను ఎప్పటికైనా పరిష్కరిస్తారో లేదో తనకు తెలియదని ఆయన స్పష్టం చేశారు. జరిగిన ఈ ఘటన చాలా భయంకరమైందని అభివర్ణించారు.
కానీ అన్ని చోట్లా క్షిపణులు ఎగురుతున్నాయని తెలిపారు. అయితే ఈ దాడికి పాల్పడిన క్షిపణి అమెరికాదని ఎవరో అన్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అది తమ క్షిపణి కాకపోవచ్చునని పేర్కొన్నారు. అది అమెరికాదే అని నమ్మడానికి తనకు ఎలాంటి ఆధారాలు కనిపించడం లేదని ట్రంప్ స్పష్టం చేశారు. అది తాము చేసిందని తాను అనుకోవడం లేదని చెప్పారు.
ఈ దాడికి యూఎస్ దళాలే బాధ్యత వహించే అవకాశం ఉందని ఆ దేశ మిలటరీ అంతర్గత విచారణలో వెల్లడైందంటూ ఈ ఏడాది మార్చిలో రాయిటర్స్ వెల్లడించింది. దాంతో ఈ వ్యవహారాన్ని అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్.. దీనిపై విచారణకు చేపట్టి ప్రాథమికంగా ఏ నిర్ధారణకు రాలేదు.
ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ప్రారంభమైంది. అదే రోజు యూఎస్, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై దాడి చేశాయి. ఈ దాడిలో మినాబ్‌లోని పాఠశాల్లోని 175 మంది మరణించారు. వారిలో చిన్నారులతోపాటు ఉపాధ్యాయులు ఉన్నారు.
అంతర్జాతీయ మానవహక్కుల చట్టం ప్రకారం.. పాఠశాలపై ఉద్దేశపూర్వకంగా దాడి చేయడం యుద్ధ నేరం అయ్యే అవకాశం ఉంది. దాంతో పాఠశాలను వాషింగ్టన్ లక్ష్యంగా చేసుకోదని ఆమెరికా అధికారులు బహిరంగంగా వెల్లడించారు. మరో వైపు ఈ దాడి ఘటనపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. ఇది అత్యంత భయంకరమైనదని ఐక్యరాజ్యసమితిలోని మానవ హక్కుల కార్యాలయం అభివర్ణించింది.
అయితే ఈ దాడికి ఇరాన్ బాధ్యత వహించాలంటూ తొలుత ట్రంప్ ఆరోపించారు. ఆ తర్వాత ఈ దాడి ఘటన గురించి తనకు అంతగా తెలియదని.. దర్యాప్తు కొనసాగుతుందన్నారు. పాఠశాలపై ఎవరూ ఉద్దేశపూర్వకంగా దాడి చేయరని ఆయన పేర్కొన్న సంగతి తెలిసిందే.
లక్ష మంది చనిపోయి ఉండొచ్చు.. వెనెజువెలా భూకంపాలపై యూఎస్జీఎస్ అంచనా..
వెనెజువెలాలో రెండు భూకంపాలు.. కారకస్‌లో వణికిపోయిన భవనాలు..
For More International News And Telugu News