
తెలంగాణ రాష్ట్రం వేడి తీవ్రత నుంచి కొంత విరామం పొందుతోంది. గత కొన్ని వారాలుగా రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న తీవ్రమైన వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతలు ప్రజల జీవన విధానాన్ని సవాలు చేశాయి.
ఇప్పుడు వాతావరణంలో సానుకూల మార్పులు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD) తాజా అంచనాల ప్రకారం, రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.ఆ జిల్లాలలో వర్షాలు .. ఎల్లో అలెర్ట్కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులు మరియు బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.గత రెండు రోజుల క్రితం వరకు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43డిగ్రీల సెల్సియస్‌ను దాటాయి. ప్రజలు ఎండల తీవ్రతకు తట్టుకోలేక ఇళ్లలోనే ఉండిపోయే పరిస్థితి ఏర్పడింది. కానీ ఇప్పుడు ఉష్ణోగ్రతలు 34 నుంచి 39డిగ్రీల మధ్యకు పడిపోయాయి.ఉరుములు-మెరుపులతో కూడిన వర్షాలువాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి వంటి జిల్లాల్లో ఉరుములు-మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.నిన్న వర్షాలు పడిన జిల్లాలు ఇవేఈ సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉంది. రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంచి వర్షపాతం నమోదైంది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్, పెద్దపల్లి జిల్లా సారంగపూర్‌లో 7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ములుగు జిల్లా గోవిందరావుపేటలో 5 సెంటీమీటర్లు, నిర్మల్ జిల్లా నర్సాపూర్‌లో 5.1 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డు అయింది.రైతులకు బిగ్ రిలీఫ్.. యూరియా బుకింగ్‌ చాలా ఈజీ!హైదరాబాద్ లో చల్లబడిన వాతావరణంహైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లోనూ చల్లని వాతావరణం నెలకొంది. ఆకాశం మేఘాలతో కమ్ముకుపోయి, చల్లటి గాలులు వీస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 1.5 నుంచి 2.6 సెంటీమీటర్ల వర్షం పడింది. ఈ వర్షాలు వ్యవసాయ రంగానికి మంచి ప్రయోజనం చేకూర్చవచ్చు. అయితే, ఉరుములు మరియు బలమైన గాలుల కారణంగా విద్యుత్ సరఫరా, రోడ్డు ప్రయాణాలు, పొలాల్లో పనులు చేసే వారు జాగ్రత్తగా ఉండాలి.