మేష రాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలు రానున్నాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు అప్పగించబడొచ్చు. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రానున్నాయి. ఉద్యోగులకు కార్యాలయంలో మెరుగైన ఫలితాలొచ్చే అవకాశం ఉంది.
మీకు సహోద్యోగుల సహకారం లభించొచ్చు. ఈ కారణంగా పనులన్నీ సకాలంలో పూర్తి చేయొచ్చు. సప్తమ స్థానం నుంచి చంద్రుని సంచారం కారణంగా మానసిక బలం పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపిస్తాయి.
వృషభ రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీ పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. సకాలంలో పనులు పూర్తి చేయడం వల్ల సంతోషంగా ఉంటారు. సహోద్యోగులతో సహకారంతో మీకు అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. వ్యాపారులకు మెరుగైన లాభాలు రావొచ్చు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. మీ శక్తి, సామర్థ్యాలు పెరిగే అవకాశాలున్నాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
మిథున రాశి వారికి నిర్జల ఏకాదశి వేళ శుభ ఫలితాలు రానున్నాయి. ఈ సమయంలో మీరు చేసే పనులన్నింట్లో అనేక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. శ్రీ విష్ణుమూర్తి అనుగ్రహంతో మీరు చేసే పనులన్నింట్లో శుభ ఫలితాలు రానున్నాయి. ఈ కారణంగా మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. వ్యాపారులకు మెరుగైన ఫలితాలు రానున్నాయి. మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది. సూర్య గ్రహం ప్రభావంతో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
కర్కాటక రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. నిర్జల ఏకాదశి వేళ మీరు చేసే పనులన్నింట్లో మెరుగైన ఫలితాలు రానున్నాయి. గ్రహాల అనుకూలత కారణంగా ఉద్యోగులకు కార్యాలయంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీకు సహోద్యోగుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది. మీరు కొన్ని బహుమతులు కూడా పొందొచ్చు. మతపరమైన, ఆధ్యాత్మిక కార్యకలాపాలపై ఆసక్తి కలిగి ఉంటారు. మీ జీవిత భాగస్వామితో ప్రేమ, సామరస్యం కొనసాగుతాయి.
సింహ రాశి వారికి ఈరోజు నిర్జల ఏకాదశి వేళ శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు చేసే పనుల్లో మంచి విజయం సాధించే అవకాశం ఉంది. ఉద్యోగులకు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు చేసిన పనులకు ప్రశంసలు లభిస్తాయి. ఉన్నతాధారుల నుంచి మీకు మద్దతు లభిస్తుంది. మీ ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. మీ తెలివితేటలు పెరుగుతాయి. మీరు చేసే పనుల వల్ల భవిష్యత్తులో సానుకూల ఫలితాలొస్తాయి.
కన్య రాశి వారికి నిర్జల ఏకాదశి వేళ శుభ ఫలితాలు రానున్నాయి. ఈ కాలంలో ఆరోగ్య పరంగా మెరుగైన ఫలితాలు రావొచ్చు. ఈరోజు మీరు చేసే ప్రయత్నాలన్నింట్లో మంచి విజయం సాధించొచ్చు. మీ మనసులో సంతోషంగా ఉంటుంది. మీ పనులన్నీ సకాలంలో పూర్తయ్యే అవకాశం ఉంది. ఈరోజు విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశాలున్నాయి. మీ పెండింగ్ పనులు తిరిగి ప్రారంభం కావొచ్చు. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీ ప్రధాన కోరికలలో ఒకటి ఈరోజు నేరవేరొచ్చు. కెరీర్ పరంగా పురోగతి లభించొచ్చు.
తులా రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు రానున్నాయి. మీరు చేసే పనికి శ్రీహరి అనుగ్రహం లభిస్తుంది. ఈ రాశి నుంచి చంద్రుడు లగ్న స్థానంలో సంచారం చేయనున్నాడు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీ బడ్జెట్ తగ్గట్టు ఖర్చులు ప్లాన్ చేసుకుంటారు. మీరు చేసే పనిలో పూర్తి ఏకాగ్రత ఉండేలా చూసుకోవాలి. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
వృశ్చిక రాశి వారికి ఈరోజు శ్రీ మహా విష్ణుమూర్తి ప్రత్యేక అనుగ్రహం లభించే అవకాశం ఉంది. మీరు చేసే పనులన్నింట్లో ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈరోజు మీరు అనవసర ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. మీ కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు. కెరీర్ పరంగా మరింత పురోగతి సాధించొచ్చు. మీకు స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది. ఈరోజు శుభకార్యాల పట్ల ఎక్కువ ఆసక్తిని కనబరుస్తారు. మీ మనసులో సంతోషంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు.
ధనస్సురాశి వారికి ఈరోజు శ్రీ మహా విష్ణువు ఆశీస్సులు లభించనున్నాయి. ఈ కారణంగా మీరు చేసే పనులన్నింట్లో అపారమైన ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. తొందరపాటుతో కూడిన లావాదేవీలు చేయడం లేదా ఆలోచించకుండా డబ్బు అప్పు ఇవ్వకుండా చూసుకోవాలి. మీరు చాలా ఓపికగా ఉండాలి. పరిస్థితులకు అనుగుణంగా మీ శక్తి, సామర్థ్యాలను పెంచుకుంటారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
మకర రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. శ్రీ మహా విష్ణువు అనుగ్రహంతో ఆర్థిక పరమైన విషయాల్లో మెరుగైన ఫలితాలు రానున్నాయి. ఉద్యోగులకు కార్యాలయంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సహోద్యోగుల నుంచి సహకారం లభిస్తుంది. మీ లక్ష్యాలను సాధించడంలో విజయం సాధిస్తారు. అనవసర విషయాలకు స్పందించకండి. వ్యాపారులు మెరుగైన లాభాలు పొందొచ్చు.
కుంభ రాశి వారికి ఈరోజు అదృష్టం కలిసొచ్చే అవకాశం ఉంది. మీ లక్ష్యాలను సాధించడంలో విజయం సాధించొచ్చు. శ్రీ హరి అనుగ్రహంతో మీ కోరికలన్నీ నెరవేరొచ్చు. ఈరోజు మీరు మరింత ఉత్సాహంగా ఉంటారు. మీరు చేసే పనులన్నింట్లో మంచి విజయం సాధించొచ్చు. కొత్త ప్రాజెక్టును ప్రారంభించాలనుకునే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మతపరమైన కార్యక్రమంలో కూడా పాల్గొనొచ్చు. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ కొత్త ఆలోచనలు అందరి ద్రుష్టిని ఆకర్షిస్తాయి.
మీన రాశి వారికి ఈరోజు అద్భుతమైన ఫలితాలు రావొచ్చు. మీ కష్టానికి తగిన ఫలితాలొస్తాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడొచ్చు. మీ నైపుణ్యాలను ఆదాయ వనరుగా మార్చుకోవడానికి మార్గాలను కనుగొంటారు. శని దేవుడి అనుగ్రహంతో మీ శ్రమకు తగిన ఫలితాలు రానున్నాయి. కెరీర్ పరంగా పురోగతి సాధించొచ్చు. వ్యాపారులకు మెరుగైన ఫలితాలొచ్చే ఉంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించొచ్చు. గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు. Read Latest Astrology News and Telugu News
రచయిత గురించిఎస్.వెంకటేష్ఎస్.వెంకటేష్ సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. 2022లో Samayam Teluguలో ఆస్ట్రాలజీ, గ్రహాల తిరోగమనం, జన్మరాశుల అనుకూలత, పరిహారాలు, పంచాంగం, ఆధ్యాత్మికంతో పాటు స్పెషల్ స్టోరీలు చేస్తుంటారు. జ్యోతిష్య నిపుణుల సలహాలు, సూచనలు, పరిహారాల గురించి ఎప్పటికప్పుడు పాఠకులకు సమాచారాన్ని చేరవేస్తూ, గ్రహాల అనుకూలత, ప్రతికూలతలను బట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తుంటారు. ఇవి వీక్షకులకు ఎంతగానో సహాయపడతాయి. జర్నలిజంలో 10 ఏళ్లకు పైగా అనుభవంలో ప్రింట్, డిజిటల్ మీడియాలో పొలిటికల్, లైఫ్‌స్టైల్, స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్, ట్రావెల్, ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మిక వార్తలను రాశారు. జ్యోతిష్యం విభాగంలో 8 వేలకు పైగా ఆర్టికల్స్, ఆరోగ్యం, బ్యూటీ, ట్రావెల్, స్పోర్ట్స్, పాలిటిక్స్, సెప్షల్ ఆర్టికల్స్ 7 వేలకుపైగా రాయడంతో పాటు, పొలిటికల్ సర్వేలు, ఫీల్డ్ సర్వే ప్రాజెక్టులను విజయవంతంగా నిర్వహించారు.జ్యోతిష్య రచయితగా వెంకటేష్ పాఠకులకు కచ్చితమైన మరియు సరైన నివారణ చర్యలు, పరిహారాల సమాచారాన్ని అందిస్తారు. జ్యోతిష్య సమాచారం పొందడం ప్రతి ఒక్కరి హక్కు అయినప్పటికీ, వృత్తి పరంగా జ్యోతిష్య సలహాలు నమ్మొద్దని గట్టిగా నొక్కి చెబుతారు. కేవలం అర్హత కలిగిన జ్యోతిష్య నిపుణులను సంప్రదించాలని, అప్పుడే మీ వ్యక్తిగత సమస్యలకు తగిన పరిష్కారం లభిస్తుందని పాఠకులకు నిరంతరం సలహా ఇస్తారు.వెంకటేష్ రాయలసీమ యూనివర్సిటీలో బ్యాచ్‌లర్ డిగ్రీ(కంప్యూటర్ సైన్స్) పూర్తి చేశారు. అలాగే పిజేఎస్ నుంచి జర్నలిజం కోర్సు పూర్తి చేశారు. ఈ అర్హతలు 5Ws మరియు 1H(ఎవరు, ఏమి, ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు మరియు ఎలా) తనకు జర్నలిజం చేసేందుకు అవసరమైన నైపుణ్యాన్ని అందిస్తాయి. డిజిటల్ కంటెంట్ రైటర్‌గా వెంకటేష్ రచనా శైలి కచ్చితత్వం, విశ్వసనీయత, నైతిక బాధ్యత, ఉన్నత ప్రమాణాలను కలిగి ఉంటుంది. తన ఆర్టికల్స్ పరిశోధన, అధ్యయనం చేసినవి. ప్రముఖ జ్యోతిష్య నిపుణులు, ఇతర రంగాల నిపుణులు, అధికారిక సంస్థలు జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటాయి. ఈ విషయాలన్నీ పాఠకులకు అర్థమయ్యేలా సులభంగా, వాడుక భాషలో అందిస్తారు.సమయం తెలుగులో చేరడానికి ముందు వన్ ఇండియాలో(05-08-2019 to 30-06-2022) సీనియర్ సబ్ ఎడిటర్‌గా హెల్త్, రిలేషన్షిప్, బ్యూటీ, ఫ్యాషన్, ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మికం, హోమ్ రెమెడీస్, రెసిపీస్ ట్రావెల్ వంటి అంశాలను కవర్ చేశారు. లోకల్ యాప్‌లో కంటెంట్ మేనేజర్‌గా(01-03-2019 to 05-08-2019) ‘‘స్వయం ఉపాధి’’ ఐపిఎల్ లైవ్ ప్రాజెక్టు, పొలిటికల్ సర్వే, ఎలక్షన్ ఈవెంట్స్‌లో కూడా పని చేశారు. అక్కడ ప్రముఖ రాజకీయ విశ్లేషకులను సంప్రదించిన తర్వాతే కచ్చితమైన సమచారాన్ని అందించారు. ప్రజాశక్తిలో కాపీ ఎడిటర్‌గా(08-02-2016 నుంచి 22-02-2019) న్యూస్, పాలిటిక్స్, స్పోర్ట్స్, సినిమా, ఫీచర్ స్టోరీలను కూడా కవర్ చేశారు.... ఇంకా చదవండి