రోజుకు చాలా సార్లు అద్దంలో చూసుకుంటూ ఉంటున్నట్లయితే మీ రూపం గురించి అతిగా ఆలోచిస్తున్నారని అర్థం. పింపుల్స్, చిన్న చిన్న చర్మ మార్పుల్ని పెద్ద లోపంగా భావిస్తున్నట్లయితే మీరు రూపం గురించి అతిగా...
రోజుకు చాలా సార్లు అద్దంలో చూసుకుంటూ ఉంటున్నట్లయితే మీ రూపం గురించి అతిగా ఆలోచిస్తున్నారని అర్థం.
పింపుల్స్, చిన్న చిన్న చర్మ మార్పుల్ని పెద్ద లోపంగా భావిస్తున్నట్లయితే మీరు రూపం గురించి అతిగా ఆలోచిస్తున్నారని అర్థం.
ఇతరుల అందంతో మీరు ఎక్కువగా పోల్చుకుంటున్నట్లు అయితే మీరు రూపం గురించి అతిగా ఆలోచిస్తున్నారని తెలుసుకోవాలి.
మీకు ఫోటోలు తీసుకోవడానికి భయం కలుగుతున్నా, ఫోటో తీస్తా అంటే తప్పించుకుంటున్నా అందం గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారని అర్థం.
మీ లుక్స్ బాగోలేకపోతే కొన్ని రోజుల పాటు నిరుత్సాహంగా ఉండడం వంటివి చేస్తున్నట్లయితే కూడా మీరు అందం గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారని అర్థం.
ఎవరైనా మీ రూపం గురించి చిన్న కామెంట్ చేసినా సీరియస్గా తీసుకుంటున్నట్లయితే అందంపై మీరు ఎక్కువ దృష్టి పెడుతున్నారు అని అర్థం.
రెడీ అవ్వడానికి ఎక్కువ టైం తీసుకుంటూ, మళ్లీ మళ్లీ చెక్ చేసుకుంటూ ఉంటే అది మీ అందం గురించి ఓవర్ థింకింగ్ అని అర్థం.
రూపంపై కాదు, వ్యక్తిత్వం, ప్రతిభ, మంచితనం గురించి ఆలోచించండి. ఇవి రూపం కంటే ముఖ్యమైనవి. మిమ్మల్ని విజయం వైపు చేరుస్తాయి.
అందంగా కనిపించడం కంటే ఆరోగ్యంగా ఉండడం చాలా ముఖ్యమని గుర్తుపెట్టుకోండి. మంచి నిద్ర, ఆహారం, వ్యాయామం ఇవన్నీ రూపం కంటే ముఖ్యమైనవి.