HDFC AMC NFO : ప్రముఖ అసెట్ మేనేజ్మెంట్ సంస్థ హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ (HDFC Mutual Fund) మరో కొత్త స్కీమ్ లాంచ్ చేసింది.
నిఫ్టీ ఆటో ఇండెక్స్ ఫండ్ ( HDFC Nifty Auto Index Fund ) అనే న్యూ ఫండ్ ఆఫర్ అందుబాటులోకి తెచ్చింది. ఇది ఒక ఓపెన్ ఎండెడ్ ఇండెక్స్ ఫండ్. ఆటోమోటివ్ రంగంలో ఎంపిక చేసిన కంపెనీల స్టాక్స్‌లో పెట్టుబడి పెడుతూ దీర్ఘకాలంలో మూలధన లాభాలు అందించడమే లక్ష్యంగా ఈ కొత్త ఫండ్ లాంచ్ చేసినట్లు తెలిపింది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ సబ్స్క్రిప్షన్, పెట్టుబడి వివరాలు తెలుసుకుందాం.హెచ్డీఎఫ్సీ నిఫ్టీ ఆటో ఇండెక్స్ ఫండ్ బెంచ్‌మార్క్ నిఫ్టీ ఆటో ఇండెక్స్ టీఆర్ఐ గా ఏఎంసీ తెలిపింది. ఈ కొత్త ఫండ్ సబ్స్క్రిప్షన్ ఇప్పటికే మొదలగా ఇనీషియల్ ఆఫరింగ్‌లో సబ్‌స్క్రైబ్ చేసుకునేందుకు జులై 3, 2026 వరకు అవకాశం ఇచ్చారు. యూనిట్ కనీస ధర రూ. 10గా నిర్ణయించారు. ఆటోమొబైల్, ఆటో కాంపోనెంట్స్ పరిశ్రమలను ట్రాక్ చేస్తూ పాసివ్ ఇన్వెస్ట్మెంట్ మార్గాన్ని అందించడమే ఈ ఫండ్ లక్ష్యమని హెచ్డీఎఫ్సీ ఏఎంసీ పేర్కొంది. ఈ కొత్త ఫండ్ మేనేజర్లుగా నందితా మెనేజెస్, అరుణ్ అగర్వాల్‌ని నియమించినట్లు తెలిపింది. ఈ ఫండ్ సబ్స్క్రిప్షన్ సమయంలో కనీస పెట్టుబడి రూ.100గా ఉంది. ఆ తర్వాత రూ.100 చొప్పున ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (SIP) ద్వారా అయితే రూ. 100గా నిర్ణయించారు. ఈ ఫండ్ నెట్ అసెట్ వాల్యూ రూ.10గా నిర్ణయించారు.యూనిట్ అలాట్మెంట్ టైమ్‌లో స్టాంప్ డ్యూటీ 0.005 శాతంగా నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది. యూనిట్ ట్రాన్స్ఫర్ పై 0.015 శాతం స్టాంప్ డ్యూటీ లెక్కించనున్నారు. ఇందులో ఎంట్రీ లోడ్, ఎగ్జిట్ లోడ్ అనేవీ ఏవీ లేవని తెలిపింది. ఎప్పుడైనా కొనుగోలు చేయవచ్చు, ఎప్పుడైనా అమ్మేసి క్యాష్ చేసుకోవచ్చు. ఈ ఫండ్‌ను హెచ్డీఎఫ్సీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ తీసుకురాగా ప్రస్తుతం ఈ ఏఎంసీ వద్ద రూ.9.06 లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి.గమనిక: మ్యూచువల్ ఫండ్స్‌లోనూ వెరీ హైరిస్క్ ఉంటుంది. మార్కెట్ ఒడుదొడుకులకు ఈ ఫండ్స్ లోనవుతాయి. పెట్టుబడి పెట్టే ముందే తగిన నిర్ణయం తీసుకోవాలి. మార్కెట్ నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. అలాగే ఈ కథనం సమచారం ఇచ్చేందుకు మాత్రమే, ఏ పెట్టుబడులను ప్రోత్సహించేందుకు కాదు. కొత్తగా మ్యూచువల్ ఫండ్స్ లోకి వస్తున్నవారు న్యూ ఫండ్ ఆఫర్స్ జోలికి వెళ్లొద్దని మార్కెట్ నిపుణులు ఎప్పుడూ చెబుతుంటారు.