
భూదాన్ పోచంపల్లి, జూన్ 24 : ఈ నెల 26న భువనగిరి జూనియర్ కళాశాల ఆవరణలో నిర్వహించే తెలంగాణ రాజ్యాధికార పార్టీ బహిరంగ సభను విజయవంతం చేయాలని టిఆర్పి రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షురాలు నీరు గౌడ్, రాష్ట్ర...
భూదాన్ పోచంపల్లి, జూన్ 24 : ఈ నెల 26న భువనగిరి జూనియర్ కళాశాల ఆవరణలో నిర్వహించే తెలంగాణ రాజ్యాధికార పార్టీ బహిరంగ సభను విజయవంతం చేయాలని టిఆర్పి రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షురాలు నీరు గౌడ్, రాష్ట్ర నాయకుడు పిట్టల శంకర్ పిలుపునిచ్చారు. బుధవారం భూదాన్ పోచంపల్లిలో బిసి సంక్షేమం, రిజర్వేషన్లపై తీన్నార్ మల్లన్న పోరాటానికి బిసి ప్రతినిధులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ ఆత్మగౌరవం, సామాజిక న్యాయం సాధించాలని, బీసీ సమాజానికి రాజ్యాధికారం తీసుకురావాలనే లక్ష్యంతో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముందుకు వెళ్తుందన్నారు. ఇది ఒక బీసీ ఆత్మగౌరవ గర్జన అని, తెలంగాణ భవిష్యత్‌ను నిర్ణయించే ఉద్యమ వేదిక అని తెలిపారు. భవిష్యత్ హక్కులు, రాజ్యాధికారం కోసం రాజ్యాధికార సమరభేరీకి బీసీ సోదరులంతా తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్పీ మల్కాజిరి అధ్యక్షురాలు శాలిని, ఉపాధ్యాయులు సౌభాగ్య, కార్యదర్శి వనజ, ప్రధాన కార్యదర్శి కోట్ల వాసు, అంజన్ కుమార్ యాదవ్, టీఆర్పీ మండల కన్వీనర్ ముద్దం సత్యం యాదవ్, బిసి నాయకులు, చింతకింది రమేష్, మైసగోని వెంకటేశం పాల్గొన్నారు.