
రేపటి నుంచి భారత్, ఐర్లాండ్ జట్ల మధ్య 2 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం అరుదైన రికార్డు పై సంజూ శాంసన్ కన్ను Sanju Samson : భారత్, ఐర్లాండ్ జట్ల మధ్య జూన్ 26 నుంచి రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్...
రేపటి నుంచి భారత్, ఐర్లాండ్ జట్ల మధ్య 2 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం అరుదైన రికార్డు పై సంజూ శాంసన్ కన్ను Sanju Samson : భారత్, ఐర్లాండ్ జట్ల మధ్య జూన్ 26 నుంచి రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. కాగా.. ఈ సిరీస్‌కు ముందు టీమ్ఇండియా వికెట్ కీపర్, బ్యాటర్ సంజూ శాంసన్‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ సిరీస్‌లో సంజూ శాంసన్ (Sanju Samson) 84 పరుగులు చేస్తే.. భారత్, ఐర్లాండ్ జట్ల మధ్య టీ20ల్లో అత్యధిక రన్స్ చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. ఈ క్రమంలో అతడు టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు రోహిత్ శర్మను అధిగమిస్తాడు. భారత్, ఐర్లాండ్ జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ప్రస్తుతం రోహిత్ శర్మ పేరిట ఉంది. రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ల్లో 200 కంటే ఎక్కువ పరుగులు సాధించిన ఏకైక ఆటగాడు రోహిత్‌కే కావడం విశేషం. Manika Batra : అందంతో చంపేస్తున్న టేబుల్ టెన్నిస్ భామ.. మనికా బాత్రా క్యూట్ ఫోటోలు వైరల్ హిట్‌మ్యాన్ 4 మ్యాచ్‌ల్లో 201 పరుగులు సాధించాడు. ఇందులో మూడు అర్థశతకాలు ఉన్నాయి. ఇక సంజూ శాంసన్ విషయానికి వస్తే.. ఐర్లాండ్ పై ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడాడు. 118 పరుగులు చేశాడు. ఇందులో ఓ హాఫ్ సెంచరీ ఉంది. భారత్-ఐర్లాండ్ జట్ల మధ్య జరిగిన టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్లు వీరే.. * రోహిత్ శర్మ - 4 మ్యాచ్‌ల్లో 201 పరుగులు * ఆండ్రూ బాల్బిర్నీ - 7 మ్యాచ్‌ల్లో 161 పరుగులు * దీపక్ హుడా - 2 మ్యాచ్‌ల్లో 151 పరుగులు * హ్యారీ టెక్టర్ - 5 మ్యాచ్‌ల్లో 123 పరుగులు * సంజూశాంసన్ - 3 మ్యాచ్‌ల్లో 118 పరుగులు