
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది.
ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Redmi 17c Price: ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ Redmi మార్కెట్లోకి మరో సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్‌ను విడుదల చేసింది. గతేడాది సెప్టెంబర్‌లో వచ్చిన రెడ్మి 15Cకి సక్సెసర్‌గా ఈ సరికొత్త Redmi 17C మోడల్‌ను చైనా మార్కెట్లో మంగళవారం అధికారికంగా విడుదల చేసింది.. ఇది భారీ డిస్ప్లేతో పాటు అదిరిపోయే బ్యాటరీ లైఫ్, అధునాతన ప్రాసెసర్‌తో అందుబాటులోకి వచ్చింది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
భారీ డిస్ప్లే.. Redmi 17C మొబైల్ 6.88 అంగుళాల భారీ డిస్ప్లేను కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 240Hz టచ్ సాంప్లింగ్ రేట్‌తో వచ్చింది.. దీనివల్ల గేమింగ్, స్క్రోలింగ్ అనుభూతి చాలా స్మూత్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది 600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో పాటు కంటి ప్రొటక్షన్ కోసం TÜV Rheinland లో బ్లూ లైట్‌తో పాటు ఫ్లికర్ ఫ్రీ సర్టిఫికేషన్‌ను కూడా ఇందులో అందించారని కంపెనీ క్లైమ్ చేస్తోంది.
పవర్ఫుల్ ప్రాసెసర్.. ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ హెలియో G81 ఆల్ట్రా (MediaTek Helio G81 Ultra) ప్రాసెసర్‌ను వినియోగించిన్నట్లు సంచారం. ఇది మల్టీటాస్కింగ్‌తో పాటు రోజువారి పనులను సులువుగా రన్ చేస్తుందని కంపెనీ క్లైమ్ చేస్తోంది. కెమెరా విభాగ విషయానికి వస్తే.. వెనుక భాగంలో 13 మెగాపిక్సెల్ సింగిల్ రియర్ కెమెరా, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ భాగంలో 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కూడా తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.
రోజంతా నడిచేలా 5,160mAh భారీ బ్యాటరీ.. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని బ్యాటరీగా భావించవచ్చు.. ఇందులో ఎంతో శక్తివంతమైన 5,160 mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని కంపెనీ అందించింది.. ఇది 18W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్‌తో లాంచ్ అయ్యింది.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే సులభంగా రోజంతా ఎంతో సులభంగా వినియోగించవచ్చు.. సెక్యూరిటీ కోసం ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను కూడా అందిస్తున్నారు.
ధర వివరాలు ఇవే.. చైనాలో విడుదలైన ఈ ఫోన్ ధరలు వేరియంట్ల వారీగా అందుబాటులో ఉన్నాయి. ఇందులోని మొదటి స్టోరేజ్ వేరియంట్ 4GB RAM + 64GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో లభిస్తోంది. ఇది భారత కరెన్సీలో సుమారు రూ. 11,200 అందుబాటులో ఉంటుంది. ఇక రెండవ వేరియంట్ 4GB RAM + 128GB స్టోరేజ్ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్ ధర సుమారు రూ. 12,600తో అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ బ్లూ, రెడ్‌తో పాటు బ్లాక్ అనే మూడు ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులో ఉంది.. అంతర్జాతీయ మార్కెట్లలో ఈ ఫోన్ ఎప్పుడు లాంచ్ అవుతుందనే అధికారిక వివరాలను కంపెనీ ఇంకా ప్రకటించాల్సి ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.