
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది.
ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Motorola Edge 70 Max Price: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ మోటోరోలా గ్లోబల్ మార్కెట్లోకి సరికొత్త సంచలనానికి తెరలేపేందుకు సిద్ధమైన్నట్లు తెలుస్తోంది.. తన ప్రతిష్టాత్మక ఎడ్జ్ సిరీస్‌లో భాగంగా అత్యంత శక్తివంతమైన ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ మోటోరోలా ఎడ్జ్ 70 మాక్స్ (Motorola Edge 70 Max)ను త్వరలోనే విడుదల చేయడానికి రెడీ అయ్యింది.. లీకైన సమాచారం ప్రకారం.. ఈ ఫోన్ మార్కెట్లో ఉన్న వివో, షావోమితో పాటు సాంసంగ్ వంటి దిగ్గజ బ్రాండ్ల ప్రీమియం ఫోన్లకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోందని సమాచారం..
కొత్త ఫ్లాట్ డిజైన్.. సాధారణంగా మోటోరోలా తన ప్రీమియం ఎడ్జ్ సిరీస్‌లో కర్వ్డ్ డిస్ప్లేలను అందిస్తుంది. కానీ, లీకైన తాజా డిజైన్ ప్రకారం.. ఈ కొత్త మాక్స్ మోడల్లో మొదటిసారిగా పూర్తి ఫ్లాట్ స్క్రీన్‌తో పాటు ఫ్లాట్ మెటల్ ఫ్రేమ్ డిజైన్‌ను అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా దీని అల్ట్రా-స్లిమ్ బెజెల్స్ ఫోన్‌కు ప్రీమియం లుక్‌ను అందిస్తున్నాయి. ఇది ఆనిక్స్ బ్లాక్, సేజ్ గ్రీన్‌తో పాటు గ్లేసియర్ బ్లూ వంటి ఎన్నో అద్భుతమైన రంగుల్లో అందుబాటులోకి రాబోతోంది.
స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 పవర్‌హౌస్.. ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని అద్భుతమైన ప్రాసెసర్.. ఇది క్వాల్కమ్కి సంబంధించిన అత్యంత శక్తివంతమైన చిప్సెట్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 (Snapdragon 8 Gen 5)తో ఈ స్మార్ట్‌ఫోన్ పని చేయబోతున్నట్లు తెలుస్తోంది.. ఇది అల్ట్రా-ఫాస్ట్ గేమింగ్‌తో పాటు అద్భుతమైన మల్టీటాస్కింగ్, మెరుగైన బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇందులో మోటోరోలా సరికొత్త ఆన్-డివైస్ ఏఐ అసిస్టెంట్ Qiraను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది రియల్-టైమ్ ట్రాన్స్లేషన్తో పాటు అడ్వాన్స్డ్ ఫోటో ఎడిటింగ్, టెక్స్ట్ సమ్మరైజేషన్ వంటి పనులను సులువుగా చేసే అవకాశాలు ఉన్నాయి.
సోనీ లైటియా కెమెరా.. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఫోటోగ్రఫీ పరంగా చూస్తే.. ఇది ఓఐఎస్ (OIS) సపోర్ట్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ సోనీ లైటియా (Sony Lytia) ప్రధాన కెమెరాను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకండా టెలిఫోటోతో పాటు అల్ట్రా-వైడ్ లెన్స్‌లతో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కూడా కలిగి ఉంటుంది. అలాగే ఇది వెనక భాగంలో అద్బుతమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఇందులో కంపెనీ ఎంతో శక్తివంతమైన 8000mAh భారీ బ్యాటరీ, మ్యాగ్నెటిక్ Qi2 వైర్లెస్ చార్జింగ్ ఫీచర్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇది కఠినమైన వాతావరణాన్ని తట్టుకునేలా MIL-STD-810H మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ సర్టిఫికేషన్‌తో అందుబాటులోకి రాబోతోంది.
ధరకి సంబంధించిన వివరాలు.. భారత మార్కెట్లో ఈ స్మార్ట్‌ఫోన్ ధర సుమారు రూ.54,999 నుంచి రూ.59,999 మధ్య ఉండే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇది అధునాతన సాంకేతికతతో పాటు సరికొత్త డిజైన్‌తో రాబోతున్న ఈ ఫోన్ ప్రీమియం ఫ్లాగ్షిప్ విభాగంలో వివో, శామ్సంగ్తో పాటు షావోమి బ్రాండ్ల ఆధిపత్యానికి గట్టి బ్రేక్ వేస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.