
రియాలిటీ టీవీ స్టార్, మాజీ మోడల్ యోలాండా హడిద్ (Yolanda Hadid) ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్ రాండాల్ "రాండీ" కెండ్రిక్ (Randy Kendrick)తో ఎంగేజ్మెంట్ చేసుకుంది.
Jun 24 2026 11:54 AM | Updated on Jun 24 2026 12:10 PM
రియాలిటీ టీవీ స్టార్, మాజీ మోడల్ యోలాండా హడిద్ (Yolanda Hadid) ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్ రాండాల్ "రాండీ" కెండ్రిక్ (Randy Kendrick)తో ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఇద్దరు సూపర్ మోడల్స్, గిగి, బెల్లా హడిద్ల తల్లిగా పాపులర్ అయిన యోలాండా హడిద్, మరోసారి పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.
'రియల్ హౌస్‌వైవ్స్ ఆఫ్ బెవర్లీ హిల్స్' (RHOBH) స్టార్ యోలాండా తన భాగస్వామి జోసెఫ్ జింగోలితో నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్న ఏడాది తరువాత వీరి నిశ్చితార్థం చేసుకున్నారు. యోలాండాకు తన మొదటి భర్త మహ్మద్ హడిద్‌తో ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరు ప్రముఖ సూపర్ మోడల్స్ గిగి హడిద్ (31), బెల్లా హడిద్ (29) , మోడల్ అన్వర్ హడిద్ (27).
రాండీ కెండ్రిక్ ఎవరు? లాస్ వెగాస్‌లో జన్మించిన రాండీ 1996లో స్థాపించిన 'Xebec' అనే జాతీయ లాజిస్టిక్స్ రియల్ ఎస్టేట్ సంస్థకు వ్యవస్థాపక సీఈఓ (CEO). అలాగే సాండౌ లేక్స్ రాంచ్ వెంచర్, సాండౌ లేక్స్ ఎనర్జీ కంపెనీలకు కూడా సీఈఓగా వ్యవహరిస్తున్నారు. అమెరికా వ్యాప్తంగా పారిశ్రామిక స్థలాలను అత్యాధునిక లాజిస్టిక్స్ హబ్‌లుగా మార్చడంలో ఈ సంస్థ ప్రసిద్ధి చెందింది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో కాలిఫోర్నియా, టెన్నెస్సీ, కెంటుకీ తదితర రాష్ట్రాలలో సౌండ్స్టేజీలు, క్రియేటర్ స్టూడియోలను నిర్మించడం ద్వారా వినోద రంగంలోకి కూడా అడుగుపెట్టారు.బయట పెద్ద బిజినెస్ టైకూన్ అయినప్పటికీ, రాండీ కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వంట చేయడం, గిటార్ వాయించడం అంటే ఇష్టం.చిన్నప్పటి నుండి 'ఎల్విస్ ప్రెస్లీ'కి పెద్ద అభిమాని. వింటేజ్ గిటార్లను సేకరించే అలవాటు ఉంది. అంతేకాదు ఆయన వద్ద అరుదైన గిటార్ల కలెక్షన్ కూడా ఉంది.
ఇదీ చదవండి: 11 ఏళ్ల చిన్నారిపై హత్యాచారం : ఆ తర్వాత తాపీగా క్యాబ్ డ్రైవింగ్
యోలాండా గతంలో జోసెఫ్ జింగోలి అనే వ్యక్తితో ఆరేళ్ల పాటు డేటింగ్ చేసి, జనవరి 2025లో విడిపోయారు. అయితే ఇప్పటికీ, వీరిద్దరూ మంచి స్నేహితులుగానే ఉంటున్నారు. అంతకుముందు యోలాండాకు రియల్ ఎస్టేట్ వ్యాపారి మహ్మద్ హడిద్ (1994-2000), మ్యూజిక్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ ఫోస్టర్ (2011-2017)లతో వివాహమైంది.
యోలాండా, రాండీ కెండ్రిక్ జంట తమ వ్యక్తిగత జీవితాన్ని , బంధాన్ని చాలా ప్రైవేట్‌గా ఉంచడంతో వీరి ప్రేమాయణం చాలా రహస్యంగా సాగింది. అయితే కష్టమైన రోజులను దాటుకుని, వ్యక్తిగత ఎదుగుదలకు ప్రాధాన్యత ఇచ్చే యోలాండా.. 62 ఏళ్ల వయసులో రాండీ కెండ్రిక్ రూపంలో మళ్లీ తన జీవితంలో సంతోషాన్ని వెతుక్కున్నందుకు ఆమె అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కలర్‌ఫుల్ చీరల్లో అందాల అదితీరావ్ (ఫొటోలు)
ముంబైని ముంచెత్తుతున్న భారీ వర్షాలు (ఫొటోలు)
టీజీ20 లీగ్‌లో ఆటగాళ్ల సందడి...స్పెషల్ అట్రాక్షన్‌గా తిలక్ వర్మ (ఫొటోలు)
తిరుమలలో టాలీవుడ్ యంగ్ హీరోహీరోయిన్ (ఫొటోలు)
'పెద్ది' మెగా బ్లాక్‌బస్టర్ ఈవెంట్.. చిరు-చరణ్ స్పెషల్ మూమెంట్స్ (ఫొటోలు)
టార్గెట్ నల్లపురెడ్డి.. హద్దు దాటిన ప్రశాంతి రెడ్డి..
ఇంగ్లాండ్ భారీ స్కెచ్.. వైభవ్ కు పోటీగా 16 ఏళ్లు కుర్రాడు
కేబినెట్ మీటింగ్ కాదు 115 మంది క్రిమినల్స్ మీటింగ్