
దేశ నిర్మాణానికి దోహదపడే మౌలిక సదుపాయాలను నిర్మించడం, సమాజంలోని ప్రతి స్థాయిలో మానవ గౌరవాన్ని కాపాడే సంస్థలను తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ స్పష్టం చేశారు.
ఈరోజు జరిగిన 34వ వార్షిక సర్వసభ్య సమావేశంలో (ఏజీఎం) ప్రసంగించిన ఆయన, వచ్చే దశాబ్ద కాలంలో సంస్థ విజన్‌ను అమలు చేసేందుకు మూడు కీలకమైన పునాది సూత్రాలను ఆవిష్కరించారు. భవిష్యత్తులో మరింత ప్రతిష్ఠ, క్రమశిక్షణ, కార్యదక్షత అవసరమని ఆయన పేర్కొన్నారు.త్రిసూత్ర ప్రణాళిక ఇదే..మొదటిది.. తమ పని విధానాన్ని సరళతరం చేస్తున్నట్లు గౌతమ్ అదానీ తెలిపారు. "అధికార యంత్రాంగాన్ని తగ్గించడానికి, జవాబుదారీతనాన్ని పదును పెట్టడానికి, నిర్ణయాలను అమలుకు మరింత చేరువ చేయడానికి మా ప్రధాన కార్యాలయాలు, సైట్లలో మూడు-స్థాయుల నిర్మాణాన్ని అమలు చేస్తున్నాం. సంస్థలో ప్రతి పాత్ర, ప్రతి ప్రక్రియ విలువను జోడించేలా ఉండాలి. ప్రధానం కాని కార్యకలాపాలను మా గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లకు (GCCs) లేదా నామినేటెడ్ భాగస్వాములకు బదిలీ చేస్తాం" అని ఆయన వివరించారు.రెండవది.. కాంట్రాక్టర్లతో తమ పని విధానాన్ని మార్చుకుంటున్నట్లు అదానీ వెల్లడించారు. వారిని దేశ నిర్మాణంలో దీర్ఘకాలిక భాగస్వాములుగా చూస్తామన్నారు. "వారి వృద్ధికి మద్దతునిచ్చే, వారి లాభాలను కాపాడే, మా ఆసక్తులతో వారి ఆసక్తులను ఏకీకృతం చేసే లోతైన, స్థిరమైన భాగస్వామ్యాలను నిర్మిస్తాం. ఇది ప్రాజెక్టులను మరింత వేగంగా, నాణ్యతతో పూర్తి చేయడానికి మాకు సహాయపడుతుంది" అని ఆయన స్పష్టం చేశారు.మూడవది.. అత్యంత ముఖ్యమైనది, కార్మికుల ఆత్మగౌరవానికి తమ పరివర్తనలో పెద్దపీట వేస్తున్నట్లు అదానీ నొక్కి చెప్పారు. "మా సొంత,