చేయగలిగే పని కంటే అధిక పని చేయడం, వర్కింగ్ అవర్స్ కంటే ఎక్కువ సేపు పని చేయడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఆఫీస్‌లో ఒత్తిడి రావడానికి మరో ప్రధాన కారణం డెడ్‌లైన్స్.
కఠినమైన డెడ్‌లైన్స్ వల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది.
ఆఫీస్‌లో చేయాల్సిన పనులు, బాధ్యతలపై స్పష్టత లేకపోవడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. స్పష్టత ఉంటే పనులు పూర్తి చేయవచ్చు.
ఆఫీస్‌లో మీ పని మీరు చేసుకునేందుకు స్వేచ్ఛ ఉండాలి. స్వేచ్ఛ లేకపోవడం వల్ల కూడా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.
మీ కష్టాన్ని గుర్తించకపోవడం వల్ల కూడా ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది.
ఆఫీస్‌లో సపోర్ట్ లేకపోవడం వల్ల కూడా ఒత్తిడి పెరుగుతుంది. సహోద్యోగులు, పై స్థాయి ఉద్యోగులు నుంచి సపోర్ట్ ఉంటే పని ఈజీ అవుతుంది.
ఉద్యోగ భద్రత లేకపోవడం వల్ల కూడా ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది. కంపెనీలో అనిశ్చితి కారణంగా మానసిక సమస్యలు వస్తాయి.
వర్క్-లైఫ్ బ్యాలెన్స్ లేకపోవడం వల్ల కూడా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఇంటి దగ్గర కూడా ఆఫీస్ పని గురించి ఆలోచించడం వల్ల మానసిక సమస్యలు వస్తాయి.
ఆఫీస్‌లో ఎటువంటి బ్రేకులు లేకుండా పని చేయడం వల్ల కూడా ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి ఆఫీస్‌లో విరామాలు తీసుకోండి.