ఈ గ్రీన్ టీ, బియ్యం పిండి మాస్క్ చర్మానికి మ్యాజిక్ లాగా పనిచేస్తుంది. స్కిన్ గ్లో పెంచుతుంది. దీనికోసం గ్రీన్ టీ తయారుచేసి చల్లారాక బియ్యం పిండిలో కలిపి పేస్ట్ చేయండి.
దీనిని ముఖానికి రాసుకుని కాసేపయ్యాక క్లీన్ చేసుకుంటే చర్మం మెరుస్తుందని డెర్మటాలజీ అధ్యయనాలు పేర్కొన్నాయి.
చర్మాన్ని మెరిపించడంలో పసుపు, పెరుగు సహాయపడతాయి. దీనికోసం రెండు స్పూన్న పెరుగులో చిటికెడు పసుపు కలిపి ముఖానికి రాసుకోండి. ఆరిన తర్వాత క్లీన్ చేసుకుంటే చర్మం కాంతివంతంగా మారుతుంది.
బొప్పాయి గుజ్జులో అరటి పండు గుజ్జు కలిపి పేస్ట్ చేయండి. దీనిని ముఖానికి రాసుకుని అరగంట సేపు ఉంచి క్లీ్న్ చేసుకోండి. వారంలో రెండుసార్లు చేస్తే చర్మం మెరుస్తుంది.
తేనె, నిమ్మరసం నేచురల్ ఎక్స్ఫోలియేట్ లాగా పనిచేసి డల్ స్కిన్ సమస్యను నివారిస్తుంది. చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. దీనికోసం రెండు స్పూన్ల తేనెలో ఒక స్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోండి. 10 నిమిషాలు ఉంచి క్లీన్ చేసుకుంటే చాలు.
అలోవెరా, కీరదోసలోని పోషకాలు చర్మాన్ని మెరిపించడంలో సహాయపడతాయి. దీనికోసం తాజా అలోవెరా రసంలో కొద్దిగా కీరదోస రసం కలిపి ముఖానికి రాసుకోండి. అరగంట తర్వాత క్లీన్ చేసుకుంటే డల్ స్కిన్ మెరుస్తుంది.
చందనం, రోజ్ వాటర్ చర్మాన్ని కాంతివంతంగా చేయడంలో దోహదపడతాయి. దీనికోసం చందనంలో కొద్దిగా రోజ్ వాటర్ కలిపి పేస్ట్ చేయండి. దీనిని ముఖానికి రాసుకుని కాసేపయ్యాక క్లీన్ చేసుకుంటే ముఖం అందంగా కనిపిస్తుంది.
శనగ పిండిలో కొద్దిగా పెరుగు, చిటికెడు పసుపు కలిపి ఈ పేస్ట్‌ను ముఖానికి రాసుకోండి. కాసేపయ్యాక క్లీన్ చేసుకుంటే డల్ స్కిన్ సమస్య తగ్గుతుంది. ముఖం మెరుస్తుంది.
ఈ రెండూ కలిపి రాసుకుంటే చర్మం కాంతివంతంగా మారుతుంది. డల్ స్కిన్ సమస్య దూరమవుతుంది. దీనికోసం ముల్తానీ మట్టిలో కొద్దిగా టొమాటో రసం కలిపి ముఖానికి రాసుకోండి. ఆరిన తర్వాత శుభ్రం చేసుకుంటే చాలు.
చర్మాన్ని కాంతివంతంగా, మృదువుగా మార్చడంలో ఈ చిట్కా పనిచేస్తుంది. దీనికోసం అవకాడో గుజ్జులో కొద్దిగా ఆలివ్ ఆయిల్ కలిపి ముఖానికి రాసుకోండి. అరగంట ఉంచి క్లీ్న్ చేసుకుంటే డల్ స్కిన్ తగ్గుతుంది.