విక్రమ్ కృష్ణ మోసం చేస్తున్న సంగతి రాధ తెలుసుకుంటుంది. తన నాన్నని కావాలనే జైల్లో మగ్గిపోయేలా విక్రమ్ చేస్తున్నాడని, తన స్వార్థం కోసం తమ బతుకులతో ఆడుకుంటున్నాడని రాధ తెలుసుకుంటుంది.
దీంతో రాధ అత్తింటి నుంచి పుట్టింటికి వెళ్తుంది. ఇక విక్రమ్, రాధలు విడిపోవడంతో ప్రియ సంబరపడుతుంది. ఇదే విషయాన్ని దమయంతికి చెప్పాలని ప్రియ వస్తుంది. ఆ ఇద్దరూ విడిపోయారా? అదేనా గుడ్ న్యూస్ అని దమయంతి అంటుంది. నీకెలా తెలిసింది మామ్ అని ప్రియ అంటుంది. నేను పెట్టిన మంటే కదా అని దమయంతి అంటుంది. ఆ అగ్నికి ఆజ్యం పోసి.. బావని రాధ కొట్టేలా చేశాను మామ్ అని తల్లీకూతుళ్లు ఇద్దరూ తెగ సంబరపడుతుంటారు.మరో వైపు రాధ రావడంతో పద్మ సంతోషిస్తుంది. అల్లుడు గారు కూడా వస్తే బాగుండు అని పదే పదే పద్మ అంటుంది. అంటే అల్లుడు లేకుండా నేను రాకూడదా? నన్ను ఇక్కడ ఉండనివ్వవా? అని రాధ సీరియస్ అవుతుంది. అల్లుడు చాలా మంచివాడు.. మీ నాన్న గురించి ఎంతో ఆలోచిస్తున్నాడు.. అని పద్మ అంటుంది. ఆయన వల్లే నాన్న ఇంకా జైల్లో ఉన్నాడని ఎలా చెప్పాలి అమ్మా నీకు అని రాధ బాధపడుతుంది. ఇంకో వైపు రాధకు డౌట్ వచ్చిందనే విషయాన్ని విక్రమ్‌కి చెప్పాలని రామలింగం వస్తాడు. కానీ రాధ ఇంట్లోంచి వెళ్లిన సంగతిని విక్రమ్ చెప్పేస్తాడు.🔹‘పొదరిల్లు’ టుడే ఎపిసోడ్ : నారాయణ నెత్తి పగలగొట్టబోయిన చక్రి.. పెద్ది ప్రేమకు, ఆప్యాయతకు కంటతడి పెట్టిన మహామోసం చేశావ్.. బయట పడింది.. రాధకి కోపం వచ్చింది.. వెళ్లింది.. ఇందులో రాధ తప్పేం లేదు.. అంతా నీదే.. నీ స్వార్థం నువ్వు చూసుకున్నావ్.. ఎల్లకాలం మనం మోసం చేయలేం.. ఏదో ఒక రోజు బయటకు వస్తుంది అని రామలింగం అంటాడు. ఇప్పుడు నువ్వు నన్ను సాధించకు.. ఏదైనా మార్గం ఉంటే చెప్పు అని అంటాడు విక్రమ్. కాళ్ల మీద పడి అయినా సరే రాధను వెనక్కి తీసుకు రావాలని రామలింగం అంటాడు. మా అమ్మ ఏమో సొంత కూతురి కంటే రాధనే ఎక్కువగా చూసుకుంటోంది.. అబద్దపు పెళ్లి అని తెలిస్తే తట్టుకోలేదు అని విక్రమ్ అంటాడు.🔹‘గుండెనిండా గుడిగంటలు’ టుడే ఎపిసోడ్: డ్రైవింగ్ స్కూల్ ఓపెన్ చేసిన బాలు, మీనా.. కార్లు కడిగే పనిలో పెడతా.. ప్రభావతికి సత్యం కౌంటర్లుమరో వైపు అందరూ కలిసి భోజనానికి కూర్చుంటారు. దమయంతి, ప్రియ ఇద్దరూ మెల్లిగా మంట స్టార్ట్ చేస్తారు. విక్రమ్, రాధ కనిపించడం లేదు అని ప్రియ అంటుంది. ఎటైనా వెళ్లి ఉంటారు అని దమయంతి అంటుంది. నా కోడలు నాకు చెప్పకుండా వెళ్లదు అని సునంద అంటుంది. వాళ్లిద్దరూ రూంలో ఉంటారు.. పిల్చుకుని రా అని మోనాలిసాకు చెబుతుంది సునంద. అంతలోనే విక్రమ్, రామలింగం రూంలోంచి కిందకు వస్తారు. మీ ఇద్దరూ రూంలోచి వస్తున్నారంటే రాధ లేదన్నట్టే కదా అని ప్రియ అంటుంది. దొంగ పెళ్లి సంగతి చెప్తే నమ్మలేదు.. ఇప్పుడు నమ్ముతారు..శీనయ్యను బయటకు తీసుకు వస్తాను అని నమ్మించి రాధను దొంగ పెళ్లి చేసుకున్నాడు.. శీనయ్య బయటకు వస్తే రాధ వెళ్లిపోతుందేమో అని అతడ్ని జైల్లో మగ్గిపోయేలా చేస్తున్నాడు విక్రమ్.. ఆ విషయం రాధకి తెలిసి విక్రమ్‌ని కొట్టి ఇంట్లోంచి వెళ్లిపోయింది.. ప్రస్తుతం పుట్టింట్లో ఉంది అని దమయంతి అంటుంది. ఇదంతా నేను నమ్మను అని సునంద అంటుంది. అయితే మీ అమ్మ మీద ఒట్టేసి చెప్పు అని విక్రమ్‌ను ఇరికిస్తుంది దమయంతి. అంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది.