
మహారాష్ట్రలోని పుణెలో వెలుగు చూసిన ఓ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. త్వరలో పెళ్లి చేసుకోబోతున్న యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ (26) మృతిని తొలుత ప్రమాదంగా భావించిన పోలీసులు, తర్వాత...
మహారాష్ట్రలోని పుణెలో వెలుగు చూసిన ఓ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. త్వరలో పెళ్లి చేసుకోబోతున్న యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ (26) మృతిని తొలుత ప్రమాదంగా భావించిన పోలీసులు, తర్వాత అది పథకం ప్రకారం జరిగిన హత్య అని గుర్తించారు.
మహారాష్ట్రలోని పుణెలో వెలుగు చూసిన ఓ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. త్వరలో పెళ్లి చేసుకోబోతున్న యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ (26) మృతిని తొలుత ప్రమాదంగా భావించిన పోలీసులు, తర్వాత అది పథకం ప్రకారం జరిగిన హత్య అని గుర్తించారు. ఈ కేసులో కేతన్కు కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌధరిని నిందితులుగా గుర్తించి అరెస్ట్ చేశారు (Pune death Mystery).
జూన్ 18న సియా గోయల్ పుట్టినరోజు సందర్భంగా కేతన్ అగర్వాల్ ఆమెతో కలిసి మహారాష్ట్రలోని లోహగడ్ కోటకు వెళ్లాడు. అక్కడ లోయలో పడి ప్రాణాలు కోల్పోయాడు. ఫొటోలు దిగుతున్న సమయంలో హోరుగాలికి కేతన్ కాలు జారి లోయలో పడిపోయాడని పోలీసులకు సియా తెలిపింది. అయితే దర్యాప్తులో అనేక అనుమానాస్పద అంశాలు బయటపడ్డాయి. మొబైల్ ఫోన్ వివరాలు, సీసీటీవీ దృశ్యాలు, సాక్షుల వాంగ్మూలాలు పరిశీలించిన పోలీసులు ఇది ప్రమాదం కాదని, పథకం ప్రకారం చేసిన హత్య అని నిర్ధారించారు (Siya Goyal, Ketan Agarwal).
సియా గోయల్ తన ప్రియుడు చేతన్ చౌధరితో కలిసి గతంలో కూడా కేతన్‌ను హత్య చేయడానికి పలుమార్లు ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. కొన్ని ప్రయత్నాలు విఫలమైన తర్వాత లోహగడ్ కోట వద్ద అవకాశం చూసుకుని అతడిని లోయలోకి తోసిసేనట్టు తెలిపారు. కేతన్ కుటుంబ సభ్యులు మొదటి నుంచే ఈ ఘటనను ప్రమాదంగా నమ్మలేదు. సియా ప్రవర్తనపై వారు అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. చివరకు వారి అనుమానాలే నిజమయ్యాయి (Pune crime news).
ఈ ఏడాది నవంబర్‌లో సియా, కేతన్ల వివాహం జరగాల్సి ఉంది (Ketan Agarwal death). ఆ వివాహం కోసం రూ.17 కోట్లతో ఉదయ్‌పూర్ ప్యాలెస్‌ను, అతిథుల రాకపోకల కోసం రెండు విమానాలను కేతన్ కుటుంబం బుక్ చేసింది. కేతన్ కుటుంబం పుణెలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉంది. కుటుంబ సభ్యుల ఇష్టాన్ని కాదనలేక కేతన్‌తో వివాహానికి అంగీకరించిన సియా.. తన ప్రియుడు చేతన్ చౌధరితో కలిసి కాబోయే భర్తను హత్య చేసింది.
నేరారోపణలు ఉన్న గ్రీన్ కార్డ్ హోల్డర్లకు అమెరికా ప్రవేశం నిరాకరణ: సుప్రీంకోర్టు కీలక తీర్పు
భారీ నష్టాల నుంచి కోలుకున్నాయ్.. లాభాల్లో దేశీయ సూచీలు..