Ketan Agarwal Pune Murder : ఈ ఏడాది ఫిబ్రవరిలో అంగరంగ వైభవంగా నిశ్చితార్థం జరిగింది. ప్రైవేట్ జెట్ విమానాలు, రాజస్థాన్‌లోని ఉదయపూర్ ప్యాలెస్ వేదికగా నవంబర్‌లో రాయల్ వెడ్డింగ్‌కు ఇరువైపులా కుటుంబ...
Ketan Agarwal Pune Murder : ఈ ఏడాది ఫిబ్రవరిలో అంగరంగ వైభవంగా నిశ్చితార్థం జరిగింది. ప్రైవేట్ జెట్ విమానాలు, రాజస్థాన్‌లోని ఉదయపూర్ ప్యాలెస్ వేదికగా నవంబర్‌లో రాయల్ వెడ్డింగ్‌కు ఇరువైపులా కుటుంబ సభ్యులు భారీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అంతా సంతోషంగా సాగిపోతుందనుకున్న సమయంలో.. ఆ కోటీశ్వరుడైన యువ వ్యాపారవేత్త మహారాష్ట్రలోని ఒక చారిత్రక కోటపై నుంచి లోయలో పడి మరణించాడు. అయితే తనను ఫొటోలు తీస్తూ హోరుగాలికి పట్టుతప్పి లోయలో పడి చనిపోయాడని.. కాబోయే భార్య చెప్పింది. కానీ ఆ తర్వాత పోలీసుల విచారణలో ఆమెనే అతడిని లోయలోకి తోసి చంపినట్లు తేలింది. అయితే ఆమెనే తన స్నేహితుడి సాయంతో కాబోయే భర్తను చంపి.. ఆపై సోషల్ మీడియాలో పెద్ద డ్రామానే చేసింది. నా పుట్టిన రోజు నాడే నన్ను వదిలి పెట్టి వెళ్లిపోయావా అంటూ కన్నీరు కార్చి.. మహానటిలా బిల్డప్ ఇచ్చింది. తానే తోసేసి.. పడిపోయాడంటూ నమ్మబలికి!పూణే జిల్లా గహుంజే ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల కేతన్ అగర్వాల్.. తన టుంబానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. జూన్ 18వ తేదీన కాబోయే భార్య పుట్టిన రోజు ఉండండతో.. సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాడు కేతన్. అయితే అప్పటికే ఆమె యునెస్కో వారసత్వ కట్టడమైన ప్రసిద్ధ లోహ్‌గఢ్ కోటకు వెళ్దామని చెప్పగా.. సరేనన్నాడు. చూస్తుండగానే పుట్టిన రోజు రావడం, కేతన్ ఆమెతో అక్కడి వెళ్లడం చకచకా జరిగిపోయాయి. అయితే అక్కడే కేతన్.. తన భార్యను ఫొటోలు తీయడం ప్రారంభించాడు. ఈక్రమంలోనే సియా తన ప్రియుడు చేతన్ బాబులాల్ చౌదరి (22)తో కలిసి కేతన్‌ను వెనుక నుంచి దాదాపు 400 అడుగుల లోతైన లోయలోకి తోసేసింది. ఆ తర్వాత లోనావాలా రూరల్ పోలీసులకు ఫోన్ చేసి, బలమైన గాలుల వల్ల కేతన్ అదుపుతప్పి లోయలో పడిపోయాడంటూ నమ్మించి యాక్సిడెంటల్ డెత్ రిపోర్ట్ నమోదు చేయించింది.చంపేసి.. ఇన్‌స్టాగ్రామ్‌లో కపట ప్రేమ నాటకం!కేతన్ మరణవార్త బయటకు రాగానే.. తనపై ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు సియా గోయల్ సోషల్ మీడియాలో డ్రామాలు చేయడం మొదలెట్టింది. కేతన్‌తో కలిసి కార్లో ప్రయాణించిన వీడియోలు, ఇద్దరూ డ్యాన్స్ చేసిన రొమాంటిక్ క్లిప్పింగులను జత చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక సుదీర్ఘమైన ఎమోషనల్ స్టోరీని పెట్టింది. "సరిగ్గా నా పుట్టినరోజు నాడే నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్లిపోయావా? మన పెళ్లికి కొన్ని నెలల సమయం మాత్రమే ఉన్నప్పుడు ఎందుకు ఇలా చేశావు? నిన్ను ఎంతో ప్రేమించిన నన్ను ఎందుకు వదిలేశావో ఇప్పటికీ అర్ధం కావడం లేదు. నా గుండెకు తెలుసు నువ్వు ఇక్కడే ఉన్నావని.. ప్లీజ్ తిరిగి వచ్చేయ్ (మేరే దిల్ కో పతా హై కీ తూ యహీ హై.. వాపస్ ఆజా)" అంటూ రాసుకొచ్చింది.ట్విస్ట్ ఇచ్చిన తండ్రి ఫిర్యాదు.. అసలు నిజం ఇదీ!కేతన్ మరణంపై తండ్రి విశాల్ అగర్వాల్‌కు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూణే రూరల్ ఎస్పీ సందీప్ సింగ్ గిల్ పర్యవేక్షణలో లోకల్ క్రైమ్ బ్రాంచ్ రంగంలోకి దిగి సియా, చేతన్‌లను అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు గుట్టు రట్టయింది. పోలీసుల కథనం ప్రకారం.. సియా గోయల్‌కు పూణే కొంధ్వా ప్రాంతానికి చెందిన చేతన్ చౌదరితో చాన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు. ప్రియుడంటే విపరీతమైన ఇష్టం కల్గిన సియాకు.. కేతన్‌తో పెళ్లి కావడం అస్సలు ఇష్టం లేదు. కానీ తల్లిదండ్రులకు ఆ విషయం తెలియకుండా ఉండేందుకు అతడంటే ఎంతో ఇష్టం ఉన్నట్లు నటించింది. ముఖ్యంగా కేతన్యే తమ ప్రేమకు అడ్డుగా మారాడని భావించిన ఈ ఇద్దరు ప్రేమికులు.. అతడిని శాశ్వతంగా వదిలించుకోవాలని కుట్ర పన్నారు. పక్కా ప్లాన్ ప్రకారమే కోటపైకి రప్పించి అంతమొందించారు. నిందితుల వాంగ్మూలం ఆధారంగా పోలీసులు సియా గోయల్, చేతన్ చౌదరిలపై భారతీయ న్యాయ సంహిత కింద హత్య, నేరపూరిత కుట్ర కేసులు నమోదు చేసి మంగళవారం ఇద్దరినీ అరెస్ట్ చేశారు.